Neem for Monsoon: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి భయపడుతున్నారా.. చింతయెలా దండగ.. వేప ఉందిగా అండగా..
ఆకులు, కాయలు, బెరడు, కలప సహా మొత్తం ఔషధ గుణాలు దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన వరం వేప చెట్టు. వేప పుల్లలతో పళ్లు తోముకోవడం వలన నోరు పరిశుభ్రమవడమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులు చర్మ సమస్యల నివారణలో అద్భుతంగా పని చేస్తుంది. వేపను అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. చర్మ సౌందర్య ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా వర్షాకాలంలో అనేక సమస్యల నుండి కాపాడుతుంది. వేప వలన కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
Updated on: Aug 25, 2023 | 4:34 PM

చర్మ సమస్యల నివారణ కోసం వేప: వర్షాకాలంలో సాధారణం వచ్చే చర్మ సమస్యలు దురద, దద్దుర్లు, మొటిమలు. వేప ఆకులు ఈ సమస్యల నుండి మీకు చాలా వరకు ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం 12 నుంచి 15 ఆకులను ఒక లీటరు నీటిలో కలిపి అరగంట పాటు మరిగించి సాధారణ నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మానికి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫెక్షన్లను తొలగిపోతాయి.

మధుమేహం నివారణిగా వేప ఆకు: వేపలో ఫ్లేవనాయిడ్స్, టెర్పెనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేపలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. వీటి ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు గోళ్లు, మొటిమలు మొదలైన అన్ని సమస్యలను నివారిస్తుంది.

ఉదర సమస్యలు దూరం: వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు కారణంగా ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్నికాపాడుతుంది. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య ఉండదు. వేప ఆకులు అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. దీని వినియోగం కారణంగా జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది.

మొటిమల సమస్యకు చెక్: శరీరంలో ఏ ప్రదేశంలోనైనా కురుపుల లేదా మొటిమల సమస్య ఉంటే వేప ఆకులతో పాటు దాని బెరడును రుబ్బి ఆ ప్రదేశంలో రాయాలి. కొద్ది రోజుల్లో ఆ సమస్య తొలగిపోతుంది.

వైరల్ ఫీవర్ నియంత్రణ కోసం వేప ఆకులు: వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు కాలానుగుణ జబ్బులను నివారిస్తుంది. జ్వరం, వైరల్ ఫీవర్ మొదలైన సమస్యలను తొలగించడంలో వేప సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లో కూడా వేప ఆకులు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.

శ్వాసకోశ సమస్యలు నుంచి ఉపశమనం: వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర శ్వాసకోశ సమస్యలను కూడా వేప దూరం చేస్తుంది.





























