AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: జుట్టు రాలడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలతో సమస్య దూరం..

జుట్టు రాలడానికి చాల రకాల కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, రక్తహీనత, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి వ్యాధుల సంకేతంగా ఉండవచ్చు. మీ జుట్టు స్థితి మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ మానసిక, భావోద్వేగ స్థితిని కూడా తెలుపుతుంది. బట్టతల పురుషుల ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. చాలా సందర్భాలలో, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలు జుట్టు రాలడానికి కారణం అవుతుంది. 12 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కోవిడ్ బాధపడిన వ్యక్తుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్ని లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

Prudvi Battula
|

Updated on: Aug 25, 2023 | 9:15 AM

Share
జుట్టు సమస్యలకు రావడానికి గల కారణాలు: రక్తహీనత మరియు థైరాయిడ్ సమస్యలు. స్ట్రెయిటెనింగ్, పెర్మింగ్ మరియు కలరింగ్ వంటి జుట్టుకు రసాయన చికిత్స. రేడియేషన్ థెరపీ. క్రాష్ డైటింగ్. శుభ్రత లేకపోవడం. సుదీర్ఘమైన కోవిడ్ లక్షణాలు.

1 / 6
జుట్టు సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు: తల చర్మం జుట్టు కుదుళ్లకు, జుట్టుకు మధ్య లింక్, చుండ్రు, ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లపై శ్రద్ధ వహించాలి. పొడి స్కాల్ప్ చుండ్రుకు దారితీస్తుంది. అధికంగా జిడ్డుగల స్కాల్ప్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అనుకూలమైన ప్రదేశంగా మారుతుంది. ఈ సమస్యల కారణంగా జుట్టు రాలుతుంది. చాలా మంది దీనిని జుట్టు రాలడం అని అనుకుంటారు. అయితే, ఈ రకమైన జుట్టు రాలే సమస్యను వైద్య పరిభాషలో టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. ఇది తాత్కాలిక దశ. ఇది ఆరు నుంచి 9 నెలల వరకు ఉంటుంది. జుట్టు రాలే సమస్య అంతకంటే ఎక్కువ కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

2 / 6
.జుట్టు రాలడానికి ఇతర కారణాలు: జుట్టు రాలడానికి స్కాల్ప్ ఎగ్జిమా, స్కాల్ప్ సోరియాసిస్ ప్రధాన కారణంగా చెపుబుతున్నారు నిపుణులు. స్కాల్ప్ సోరియాసిస్ నెత్తిమీద మందంగా, పొలుసులుగా, పెరిగిన పాచెస్‌గా ప్రారంభమవుతుంది. ఆ తరువాత చెవులు, మెడ, నుదిటి వరకు వ్యాపించవచ్చు. ఇది ఒక ఆటో-ఇమ్యూన్ వ్యాధి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసినప్పుడు ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం పొరలుగా ఉంటుంది.

3 / 6
స్కాల్ప్ ఎగ్జిమా వల్ల సమస్య పెరుగుతుంది: స్కాల్ప్ ఎగ్జిమా వల్ల చర్మంపై దురద, పొడి, ఎర్రబడిన చర్మం వస్తుంది. దీనికి సాధారణ కారణాలు మితిమీరిన షాంపూ వాడకం, రసాయనాలను ఎక్కువగా ఉపయోగించడం. ఇది తలపై చికాకు, వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధులకు చికిత్స చేయకపోతే.. శరీరంలోని వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతాయి.

4 / 6
ఇలాంటి సమస్యలకు నోటి ద్వారా తీసుకునే మందులు, షాంపూలు, లోషన్లు చాలానే ఉన్నాయి. అయితే, ఔషధాల్లో ఉండే పదార్థాలు ఎక్కువగా వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, చికాకు, అలెర్జీ, రక్తపోటు, నపుంసకత్వం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వాడటం మంచిదని సూచిస్తున్నారు. 

5 / 6
సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. మృదువైన పళ్లు కలిగిని హెయిర్ బ్రష్ ఉపయోగించాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి.

6 / 6
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్