Brinjal Side Effects: వర్షాకాలంలో వంకాయ కూరకు దూరంగా ఉండాలంటారు ఎందుకో తెలుసా.. కారణం ఇదే..
Eggplant Side Effects: వర్షాకాలం అంటేనే వ్యాదుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దీనికితోడు మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం. జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణంలో తేమ వాతావరణం కారణంగా బ్యాక్టీరియా వ్యాప్తి చాలా ఉంటుంది. దీనికితోడు ఈ సీజన్‌లో కొన్నింటిని పక్కన పెట్టడం మంచిది. వర్షాకాలంలో ఆకుకూరలతోపాటు వంకాయ వంటివాటిని కొంత తక్కువగా తింటే మంచిది.