Calcium Rich Foods: పాలు, పెరుగు అంటే ఇష్టం లేదా ? అయితే ఈ పదార్థాలతోనూ కాల్షియం లోపానికి చెక్ పెట్టండి..

కాల్షియం మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకం. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండాలంటే.. కాల్షియం శరీరంలో పుష్కలంగా ఉండాల్సిందే. అలాగే కండర ద్రవ్యరాశిని

Calcium Rich Foods: పాలు, పెరుగు అంటే ఇష్టం లేదా ? అయితే ఈ పదార్థాలతోనూ కాల్షియం లోపానికి చెక్ పెట్టండి..
Rich
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2021 | 9:29 PM

కాల్షియం మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకం. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండాలంటే.. కాల్షియం శరీరంలో పుష్కలంగా ఉండాల్సిందే. అలాగే కండర ద్రవ్యరాశిని పెంచడంలోనూ సహయపడుతుంది. అయితే పాలు, పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లలు పాలు, పెరుగు తీసుకోవడం వలన కాల్షియం లోపాన్ని నివారించవచ్చు అని అంటుంటారు. అయితే చాలా మందికి పాలు, పెరుగు తీసుకోవడం ఇష్టముండదు. అలాంటి వారు కాల్షియం లోపాన్ని నివారించాలంటే.. కొన్ని విత్తనాలు, కూరగాయాలలోనూ లభిస్తుంది. అవి ఎంటో తెలుసుకుందామా.

1. చియా విత్తనాలు ఎముకలు, దంతాలు, గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడతాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి మీ పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్ కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. రోజూ 45 గ్రాముల చియా గింజలు ఒక గ్లాసు పాలకు సమానం. ఇవి కాల్షియం అందిస్తాయి.

2. రోజ్ వుడ్ విత్తనాలు.. చిన్న నలుపు, తెలుపు నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో మాంగనీస్, జింక్, రాగి ఉంటాయి. 30 గ్రాముల నువ్వులలో 300 గ్రాముల కాల్షియం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం రక్తపోటు నివారించింది. కొలెస్టాల్ నియంత్రిస్తుంది. ఇది కాకుండా.. ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 3. గసగసాలు..  మాంగనీస్, కాల్షియం ప్రధాన మూలం. 20 గ్రాముల విత్తనాలలో 300 గ్రాముల కాల్షియం ఉంటుంది. ఈ విత్తనాలలో ప్రోటీన్, రాగి ఉంటుంది. ఇందులో ఆమ్లాలు, కొవ్వులు, పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 4. మిల్లెట్, రాగి… 100 గ్రాముల రాగి లేదా మిల్లెట్‏లో 300 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. మిల్లెట్లలో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచడంలో సహాయపడుతుంది. రాగిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మిల్లెట్ ఆరోగ్యాన్నిస్తుంది. చక్కెర స్థాయిని పెంచుతుంది.

Also Read: Walnuts: మీకు ఎక్కువ కాలం బతకాలని ఉందా..? అయితే దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి. ఇది చెబుతోంది ఎవరో కాదు.

Seeti Maar: థియేటర్లలో ‘సీటీమార్‌’ వేసే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.