వంటల్లో గ్రేవీ చిక్కగా రావడం లేదా ? ఇలా చేస్తే.. రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది.. అవెంటంటే..
రెస్టారెంట్ ఫుడ్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ స్టైల్లో ఫుడ్ ఇంట్లో ట్రై చేయాలని చాలా వరకు ఆడవాళ్లు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా కర్రీలో, సాంబార్
రెస్టారెంట్ ఫుడ్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఆ స్టైల్లో ఫుడ్ ఇంట్లో ట్రై చేయాలని చాలా వరకు ఆడవాళ్లు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా కర్రీలో, సాంబార్ , పప్పు వంటకాలలో గ్రెవీ చాలా చిక్కగా రావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే రెస్టారెంట్ స్టైల్లో గ్రేవి చిక్కగా రావాలంటే ఈ ఆహార పదార్థాలను కలపండి. అవెంటో తెలుసుకుందమా.
1. గ్రేవిని చిక్కగా చేయడానిక మైదా మంచూరియన్, చిల్లీ బంగాళదుంపలను తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో 2 టీస్పూన్ల పిండి, అరకప్పు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని వంటలో వేయాలి. అయితే మైదా పిండి కాకుండా.. మొక్కజొన్న పిండిని కూడా ఉపయోగించవచ్చు. కానీ ప్రతిసారి పిండి కలపకూడదు. 2. రెస్టారెంట్ స్టైల్లో గ్రేవి రావడానికి టమోటా పూరీ బెస్ రెడీ చేస్తారు. ఇందుకోసం ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి మొత్తగా రుబ్బి వంటలలో వేసుకోవాలి. 3. నాన్ వెజిటేరియన్ అయితే అందులో గుడ్డు వేసుకోవచ్చు. గుడ్డును పగలగొట్టి గిన్నెలో చిలక్కోట్టాలి. ఆ మిశ్రమాన్ని గ్రేవిలో కలపాలి. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 4. గ్రేవిని చిక్కగా చేయడానికి గ్రేవిలో శనగపిండిని కలపవచ్చు. అయితే ఈ పిండిని వేసే ముందు కాస్త వేయించాలి. ఒక స్పూన్ శనగపిండిలో అరకప్పు నీరు కలిపి వేసుకోవాలి. మైదా, మొక్కజొన్న పిండి కంటే శనగపిండి మంచిది.
Also Read: Vidyadhan Scholarships: విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరి
Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.