AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కిచెన్‏లో ఈ మొక్కలుంటే అనారోగ్య సమస్యలు ఫసక్… హెర్బల్ ప్లాంట్స్ గురించి తెలుసుకోండి..

ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావంతో సహజ వనరులను

మీ కిచెన్‏లో ఈ మొక్కలుంటే అనారోగ్య సమస్యలు ఫసక్... హెర్బల్ ప్లాంట్స్ గురించి తెలుసుకోండి..
Kitchen Garden
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2021 | 8:17 PM

Share

ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావంతో సహజ వనరులను తీసుకోవడానికే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.. అంతేకాకుండా.. ఇటీవల కాలంలో చెట్లు.. మొక్కలు.. ఇంటి చుట్టూ ప్రత్యేకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్ననారు..ఇందుకోసం తమ ఇంటి పరిసరాల్లో రకరకాల మొక్కలను పెంచుకుంటున్నారు. అయితే కొన్ని మొక్కలు మీ ఇంటి కిచెన్ పరిసరాల్లో పెంచితే ఆరోగ్యమే కాదు.. ఆహారపు రుచిని కూడా పెంచుతాయి. సాధారణంగా చాలా వరకు కొత్తిమీర, పుదీనా, పాలకూర, కరివేపాకు మొక్కలను పెంచుకుంటారు. అయితే ఆహారం రుచి పెరగడానికి కొన్ని రకాల హెర్బల్ ప్లాంట్స్ కూడా పెంచుకోవడం ముఖ్యమే.. అవెంటో తెలుసుకుందామా.

1. వంటగది దగ్గర్లో పార్ల్సీ మొక్కలు పెంచుకోవడం ఉత్తమం.. ఇందులో విటమిన్ సీ, కె పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి ఆహారం రుచి పెంచడమే కాకుండా.. మలబద్ధకం.. మధుమేహం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. 2. కిచెన్ దగ్గర్లో పచ్చిమిర్చి మొక్కలు ఉండాలి.. ఇవి మంచి నిద్రను కలిగించడమే కాకుండా.. ఆహారపు రుచిని పెంచుతాయి. పచ్చిమిర్చిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. 3. రోజ్మేరీ మొక్క ఆరోగ్యానికి మంచిది. రోజ్మేరీ టీ మానసిక ఉత్సాహాన్నిస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం మరియు విటమిన్ B6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్మేరీ తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. కానీ ఈ మొక్కను నాటేటప్పుడు, దానిపై ప్రత్యక్ష సూర్యకాంతి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 4. థైమ్ మొక్క వంట రుచి పెంచుతుంది. అలాగే మటన్ వంటి నాన్ వెజ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, గొంతునొప్పి, కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. 5. నిమ్మఔషధ తైలం వేయవచ్చు. ఈ మొక్క పుదీనా లాగా ఉంటుంది కానీ నిమ్మకాయ వాసన వస్తుంది. నిమ్మ ఔషధతైలం ఫినాలిక్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆహార రుచిని పెంచడానికి పనిచేస్తుంది. దీనితో పాటు, రోగనిరోధక శక్తిని పెంచడంలో, రేడియేషన్ దెబ్బతినకుండా రక్షించడంలో, మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలను తొలగించడంలో కూడా ఇది చాలా సహాయపడుతుంది.

Also Read: Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మళ్లీ నిరాశేనా.. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మారిపోయిందా ?

Manchu Vishnu: హద్దులు మీరుతున్నారు… అసభ్యకరంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్..