Corona: కొంప ముంచిన కరోనా..! ఆ విషయంలో రెండు సంవత్సరాలు తగ్గించింది..
Corona: కరోనాతో గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే చాలామంది భవిష్యత్‌పై దెబ్బ కొట్టింది. చాలామంది కోలుకోలేని
Corona: కరోనాతో గత రెండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే చాలామంది భవిష్యత్‌పై దెబ్బ కొట్టింది. చాలామంది కోలుకోలేని పరిస్థితులలో ఉన్నారు. కరోనాకు గురైన చాలామంది ఇప్పటికీ పోస్ట్ కొవిడ్‌తో ఇబ్బందిపడుతూనే ఉన్నారు. ఆర్థికంగా, మానసికంగా చాలామంది నష్టపోయారు. తాజాగా ఈ మహమ్మారి మరో నష్టాన్ని కలిగించింది. ఇండియాలో కొవిడ్‌కి గురైన వారి ఆయుష్షు రెండు సంవత్సరాలు తగ్గిపోయిందని ఒక నివేదికలో వెల్లడైంది.
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ (IIPS) ప్రకారం.. 2019 లో భారతీయ పురుషుల సగటు ఆయుర్దాయం 69.5 సంవత్సరాలు. 2020 నాటికి అది 67.5 ఏళ్లకు తగ్గింది. అదేవిధంగా మహిళల ఆయుర్దాయం 72 ఏళ్ల నుంచి 69.8 ఏళ్లకు తగ్గింది. ఐఐపీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ అధ్యయనం BMC పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.
గత రెండేళ్లలో 35 నుంచి 69 ఏళ్లలోపు వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఇది ఈ గణాంకాలపై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు మార్చి 2020 నుంచి నాలుగు మిలియన్ల మరణాలకు పెరిగాయి. భారతదేశంలో మరణాల సంఖ్య చాలా రెట్లు ఎక్కువ అని డేటా నిపుణులు పేర్కొంటున్నారు.
గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ (GBD) ప్రకారం.. స్పెయిన్‌లో జీవితం 2.28 సంవత్సరాలకు పడిపోయింది. ఇది కాకుండా కోవిడ్ ఇండియా అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్ పోర్టల్ ద్వారా కూడా అధ్యయనం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మరణాలు భారీగా పెరగడానికి దారితీసింది. ఇంగ్లండ్, USA వంటి దేశాల్లో ఈ జీవితకాలం 1 సంవత్సరం తగ్గింది. స్పెయిన్ 2.28 సంవత్సరాల అతిపెద్ద క్షీణతను చవిచూసింది.