Viral Video: అరెరె.. క్యాప్సికం చెట్లకు డబ్బులు కాస్తున్నాయ్.. ఏంటిది..?
‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా’ ఏంటి..?. ఇది లైఫ్‌లో మనం రెగ్యులర్‌గా వినే డైలాగ్. కానీ ఓ వ్యక్తి నిజంగానే తన పెరట్లో మొక్కల నుంచి...
‘డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా’ ఏంటి..?. ఇది లైఫ్‌లో మనం రెగ్యులర్‌గా వినే డైలాగ్. కానీ ఓ వ్యక్తి నిజంగానే తన పెరట్లో మొక్కల నుంచి రూపాయి కాయిన్లను కాయించనట్టు చెబుతున్నాడు. అందుకు సాక్ష్యంగా లైవ్ వీడియో కూడా చూపిస్తున్నాడు. అసలు ఈ మొక్కల సంగతి ఏంటి.. దీని వెనుక మర్మం ఏంటి.. తెలుసుకుందాం పదండి.
గ్రామాల్లో ఇంటి వెనక ఖాళీ స్థలం ఉంటే కూరగాయలు, ఆకుకూరల మొక్కలు నాటడం పరిపాటి. ఇప్పడు సిటీల్లో సైతం బాల్కనీలో లేదా టెర్రస్‌పై ఈ తరహాలో కూరగాయలు పండిస్తున్నారు. ఏదో ఇంట్లో వంటకు సరిపోయేలా మొక్కలు పెంచుతున్నారు. అయితే ఓ వ్యక్తి తన పెరట్లో క్యాప్సికం మొక్కలు పెంచాడు. అవి పెరిగి.. పెద్దవై ఏపుగా కాశాయి. అయితే ఆ క్యాప్సికం కాయలను చీల్చితే లోపల రూపాయి బిళ్లలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఇదెలా సాధ్యం సుమీ అని తికమకపడుతున్నారు. మరీ ఎక్కువగా ఆలోచించకండి. ఇదో ఫ్రాంక్ వీడియో. ఓ వ్యక్తి ముందుగా క్యాప్సికం వెనుక భాగం కట్‌చేసి లోపల కాయిన్స్ పెట్టి, గమ్‌తో అతికించాడు. ఆపై తానేదో అద్భుతం చేసినట్లుగా కలరింగ్ ఇచ్చాడు. అయితే ఈ విషయం తెలియక చాలామంది నెటిజన్లు అయితే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడ అంత సీన్ ఏం లేదు గురూ..!. సహజంగా చెట్లకు డబ్బులు ఎలా కాస్తాయండి మరీ వెర్రి కాకపోతే. అయితే ఈ వీడియోతో మాత్రం అతను బాగా ఫేమస్ అయ్యాడు. నెటిజన్లు అయితే అతడి వీడియోపై స్పందిస్తున్న విధానం మాత్రం నవ్వు తెప్పిస్తోంది. నీకు మా కంటే వెర్రిబాగులోళ్లు దొరకలేదా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఏమిరా నీవల్ల లోకానికి ఉపయోగం అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
View this post on Instagram
Also Read: Viral Video: హైనాపై సింహాల మూకుమ్మడి దాడి.. ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది