Corona New Variant: భారత్ లో కొత్త కరోనా వేరియంట్.. ఇది చాలా స్పీడ్.. జాగ్రత్త పడాల్సిందే..!

కరోనా డెల్టా వేరియంట్ కొత్త మ్యూటెంట్ AY-4 ఇండోర్‌లో బయటపడింది. ఏడుగురు రోగుల నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఈ వేరియంట్ వెల్లడైంది. అయితే, ఈ వేరియంట్‌కు సంబంధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

Corona New Variant: భారత్ లో కొత్త కరోనా వేరియంట్.. ఇది చాలా స్పీడ్.. జాగ్రత్త పడాల్సిందే..!
Coronavirus
Follow us

|

Updated on: Oct 24, 2021 | 7:14 PM

Corona New Variant: కరోనా డెల్టా వేరియంట్ కొత్త మ్యూటెంట్ AY-4 ఇండోర్‌లో బయటపడింది. ఏడుగురు రోగుల నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఈ వేరియంట్ వెల్లడైంది. అయితే, ఈ వేరియంట్‌కు సంబంధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందువల్ల, దాని స్వభావానికి సంబంధించిన పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. కానీ చాలా మంది నిపుణులు ఈ వేరియంట్ వ్యాప్తి సంభావ్యతను పాత వేరియంట్ కంటే వేగంగా వర్ణిస్తూ, జాగ్రత్త వహించాలని సూచించారు.

ఇండోర్‌లో, సెప్టెంబర్‌లో 7 మంది కరోనా బాధితులుగా గుర్తించారు. ఈ నమూనాలన్నీ సెప్టెంబర్ 21 న జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఢిల్లీ NCDC ల్యాబ్ నుండి జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ఇటీవల విడుదల చేశారు. అందులో ఈ ఏడుగురికి సోకిన కరోనా AY-4 రకానికి చెందినదిగా నిర్ధారించారు.

ఈ మ్యూటంట్ ఏప్రిల్‌లో మహారాష్ట్రలో కనిపించింది..

డెల్టా వేరియంట్ కు చెందినా ఈ AY-4 కొత్త మ్యూటంట్ దేశంలో మొదటిసారిగా ఏప్రిల్‌లో మహారాష్ట్రలో కనిపించింది. ఇప్పుడు ఇండోర్‌లో ఈ మ్యూటంట్ సోకిన రోగులు వెలుగులోకి వచ్చారు. అయితే, ఇప్పుడు ఇండోర్ రోగులందరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. వారికి లేదా వారి నుండి ఎవరికీ ప్రమాదం లేదు.

ఇండోర్‌లో ఈ నెలలో కనుగొనబడిన జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో, ఈ రూపాంతరాన్ని కనుగొన్న వారిలో ఇద్దరు వ్యక్తులు న్యూ పలాసియాకు చెందినవారు. ఒకరు దుబే తోట నుండి, ముగ్గురు మోవ్ నుండి. మరొకరు వేరొక ప్రదేశానికి చెందినవారు. ఈ వ్యక్తులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని నోడల్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ మలాకర్ చెప్పారు. ప్రస్తుతం, AY-4 వేరియంట్ ప్రసార సామర్థ్యంపై ప్రపంచంలో పరిశోధన జరుగుతోంది. కాబట్టి ఏదైనా చెప్పడం సరికాదు, కానీ యిప్పుడు భయాందోళనకు గురయ్యే పరిస్థితి లేదు.

డాక్టర్ రవి దోసి ప్రకారం , అధిక సంక్రమణ రేటు కారణంగా జాగ్రత్త అవసరం. AY-4 మరింత వేగంగా విస్తరించే వైరస్. దీని ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు గుంపులోకి వెళ్ళకూడదు. మాస్కులు ధరించకుండా బయటకు వెళ్ళకూడదు. ప్రస్తుతం సామాజిక దూరం పాటించని వ్యక్తులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పండుగ దగ్గర పడింది. చాలా అవసరం అయితే మాత్రమే బయటకు వెళ్లండి. ప్రాథమికంగా, ఈ వేరియంట్ కనుగొనబడిన వ్యక్తులు కచ్చితంగా వారు కోవిడ్ సెంటర్‌లో ఐసోలేషన్ కు వెళ్ళాలి.

టీకా వేసిన తర్వాత కూడా ఈ వేరియంట్ వచ్చే అవకాశం ఉందా?

డాక్టర్ దోసి ప్రకారం, ఏదైనా కొత్త వేరియంట్ చెలామణిలోకి వచ్చిన ఒక నెల తర్వాత మాత్రమే దాని గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. టీకా తర్వాత కూడా సంక్రమణ సంభవించవచ్చు. ఇది డెల్టా వేరియంట్‌లో కూడా కనిపించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి కేసులు అనేకం వస్తున్నా వైరస్‌ ప్రభావం అంతగా కనిపించడం లేదు. మొదట కొత్త వేరియంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆపై దాని ప్రోటోకాల్‌ను నిర్ణయించాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి దీనిని ICMR టైప్-A వేరియంట్‌గా ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం ఎటువంటి అంచనా వేయలేము. ఏదైనా చెప్పడానికి చాలా తొందరపాటు అవుతుంది.. అయినప్పటికీ, పూర్తి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ వేరియంట్ ఉన్నట్లు గుర్తించిన వ్యక్తులను వేరుచేయవలసి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ ఎక్కడ నుండి వస్తుంది అంటే, సమాధానం చెప్పడం కష్టం. నమూనా ఎక్కువగా ఉన్న చోట నుండి కొత్త వేరియంట్లు వస్తాయి. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలో ఎక్కువ శాంప్లింగ్ జరుగుతోంది. కనుక అది అక్కడి నుండి వచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ, ప్రజలు దీనిని తేలికగా తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రజలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. చాలా మందికి ఇంకా రెండవ డోస్ ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో, టీకా పొందడంతో పాటు కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించడం చాలా ముఖ్యం.

భయపడవద్దు …

తెలుసుకోండి, డాక్టర్ విపి పాండే (AOD, మెడిసిన్, MYH) ప్రకారం, ఏదైనా కొత్త వేరియంట్ అంటువ్యాధి పూర్తి వివరాలు కొంత సమయం తర్వాత కూడా తెలుస్తుంది. ఏదేమైనా, ప్రతి వైరస్ కొత్త వైవిధ్యాలు రావడం ఒక ప్రక్రియ, ఎందుకంటే దాని స్వభావం ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, అప్రమత్తంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి: Ant Eaters: పొడవాటి నాలుకలతో చీమలను తింటూ జీవించే జీవుల గురించి మీకు తెలుసా?

Terrorism: ఉప్పెనంత విషాదం గుండెల్లో.. కొండంత ఆత్మవిశ్వాసం ఆ చిరునవ్వుల్లో.. ఈ ఫోటో వెనుక హృదయాలను కదిలించే కథ!

Smart Bandage: ఈ స్మార్ట్ బ్యాండేజ్ శరీరంలో గాయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు మీకు చెబుతుంది.. ఎలా అంటే..