AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terrorism: ఉప్పెనంత విషాదం గుండెల్లో.. కొండంత ఆత్మవిశ్వాసం ఆ చిరునవ్వుల్లో.. ఈ ఫోటో వెనుక హృదయాలను కదిలించే కథ!

ఈ ఫోటోను పరిశీలించండి. మీకు ఏమనిపిస్తోంది. మొదట కచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక దివ్యాంగుడు తన ముద్దుల తనయుడిని ఆడిస్తున్న దృశ్యం.. తరువాత దీనిని చూస్తే గుండెల్ని పిండేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే.. ఆ చిన్నారి కూడా దివ్యాంగుడు కావడం.

Terrorism: ఉప్పెనంత విషాదం గుండెల్లో.. కొండంత ఆత్మవిశ్వాసం ఆ చిరునవ్వుల్లో.. ఈ ఫోటో వెనుక హృదయాలను కదిలించే కథ!
International Best Photo
KVD Varma
|

Updated on: Oct 24, 2021 | 5:30 PM

Share

Terrorism: ఈ ఫోటోను పరిశీలించండి. మీకు ఏమనిపిస్తోంది. మొదట కచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక దివ్యాంగుడు తన ముద్దుల తనయుడిని ఆడిస్తున్న దృశ్యం.. తరువాత దీనిని చూస్తే గుండెల్ని పిండేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే.. ఆ చిన్నారి కూడా దివ్యాంగుడు కావడం. అయ్యో అనిపిస్తుంది. కానీ, ఆ ఫోటోలో ఆ తండ్రీ బిడ్డల కళ్ళలో కనిపిస్తున్న కాంతి గమనించారా? కల్మషం లేకుండా నవ్వుతున్న ఆ చిన్నారి నవ్వు చూశారా? ఆ తండ్రి మోహంలో కనిపిస్తున్న ప్రేమైక ఆనందాన్ని చూశారా.. ఇప్పుడు ఏమనిపిస్తోంది.. అద్భుతం అనిపిస్తుంది కదూ.. ఈ ఫొటోకు అంతర్జాతీయ అవార్డు వచ్చింది. అవార్డు ఎందుకు వచ్చింది? ఈ తండ్రీ కొడుకుల కథ ఏమిటీ తెలిస్తే ఒక్క క్షణం అయినా మీ గుండె చెమరుస్తుంది.. ఎందుకంటే..

చిత్రంలో ముంజీర్ అనే సిరియన్ యువకుడు కనిపిస్తున్నాడు. ఆయన కుమారుడు ముస్తఫా ఉన్నాడు. సిరియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న తీవ్రవాదం తెచ్చిపెట్టిన వైకల్యం చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే, తీవ్రవాద దాడుల్లోనే ఇద్దరికీ వైకల్యం ప్రాప్తించింది. సిరియాలోని ఇడ్లిబ్ నగరంలో జరిగిన బాంబు పేలుడులో మున్సిర్ తన కుడి కాలును కోల్పోయాడు. కొడుకు ముహమ్మద్‌కు రెండు కాళ్లు చేతులు లేకుండా పుట్టాడు. మహ్మద్ తల్లి జైనా సిరియాలో పౌర అశాంతి సమయంలో విషవాయువు దాడికి గురయ్యారు. ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్ల జైనా తీసుకున్న డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్ గా మహమ్మద్ వైకల్యాలతో పుట్టాల్సి వచ్చింది. ఆ కుటుంబం తరువాత సిరియా నుండి టర్కీకి శరణార్థులుగా పారిపోయింది. ఇదీ ఈ తండ్రీ కొడుకుల అంగ వైకల్యం కథ. తీవ్రవాద పాశవిక ఘట్టనలలో నలిగిపోయిన ఒక కుటుంబం కథ.

ఈ ఫోటోను టర్కిష్ ఫోటోగ్రాఫర్ మొహమ్మద్ అస్లాన్ తీశారు. అతను సిరియాతో సరిహద్దును పంచుకునే టర్కీ ప్రావిన్స్ హట్టిలోని రేహన్లీ నుండి ఈ క్షణాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆయన ఈ చిత్రానికి ‘హార్డ్ షిప్ ఆఫ్ లైఫ్’ అని పేరు పెట్టారు. అవార్డుల కమిటీ సభ్యుల్లో ఒకరైన కడవోకా హిడ్కో, “ఈ చిత్రం వారు అనుభవిస్తున్న సుదీర్ఘమైన, కష్టతరమైన అనుభవాల బాధను తెలియజేస్తుంది” అని పేర్కొన్నారు. ఫోటోలో మనం చూసే వారి కళ్ళలో కనిపిస్తున్న ఆనందం వెనుక ఉన్న విషాదం తెలిస్తే గుండె బరువెక్కింది కదూ. చిన్న చిన్న విషయాలకు డీలా పడిపోయి.. అన్నీ ఉన్నా.. కులం, మతం పేరుతో మన జీవితాల్లో అశాంతిని రేకెత్తించుకుని మనశ్శాంతి లేకుండా బ్రతికే చాలా మందికి.. ఈ ఫోటో ఒక స్ఫూర్తి. ఎందుకంటే.. తీవ్ర విషాదంలోనూ ఆ తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ప్రేమానుబంధం.. వారి కల్మషం లేని చిరునవ్వు.. కచ్చితంగా మన మనసు పొరల్ని తాకుతాయి.

దశాబ్దానికి పైగా కొనసాగుతున్న అంతర్యుద్ధం సిరియా ప్రజలను వర్ణించలేని దుస్థితికి నెడుతోంది. వారు తమ మాతృభూమిని విడిచిపెట్టవలసి వస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం, ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, టర్కీలలో 56 మిలియన్లకు పైగా సిరియన్లు శరణార్థులుగా జీవిస్తున్నారు.

Also Read: Amit Shah J&K Visit: జమ్ముకశ్మీర్‌ అభివృద్ధే లక్ష్యం.. ఐఐటీ క్యాంపస్‌ను ప్రారంభించిన హోం మంత్రి అమిత్‌షా

Mann Ki Baat: వ్యాక్సిన్ విజయంతో సేవకు కొత్త అర్థం చెప్పారు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ..

Aadhaar card: ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవాలని అనుకుంటున్నారా.. ఇలా చేయండి.. చాలా ఈజీ..