Vaccination: వ్యాక్సిన్ వేసుకుంటే పీరియడ్స్‌లో మార్పులు వస్తాయా ? పరిశోధకుల షాకింగ్ కామెంట్స్..
కరోనా వ్యాక్సిన్ పట్ల ఇప్పటికీ చాలా మందిలో ఉన్న సందేహాలు తగ్గడం లేదు. చర్మ సమస్యలు.. ఇతర వ్యాధులు ఉన్నవారు మాత్రమే కాకుండా..
కరోనా వ్యాక్సిన్ పట్ల ఇప్పటికీ చాలా మందిలో ఉన్న సందేహాలు తగ్గడం లేదు. చర్మ సమస్యలు.. ఇతర వ్యాధులు ఉన్నవారు మాత్రమే కాకుండా.. సామాన్యులు కూడా టీకా వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కారణం వ్యాక్సిన్ పై సరైన అవగాహన లేకపోవడం. ఇక ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోతారని… లేదంటే మరిన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మహిళలలో అనేక మార్పులు సంభవిస్తాయని ఒక అపోహ ఉంది. కానీ నిపుణులు మాత్రం టీకా తీసుకుంటే మరణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని.. కరోనాను అడ్డుకోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అంటున్నారు. ఇక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన ఇంతకాలం అవుతున్న టీకాపై అపోహలు మాత్రం పోవడం లేదు. ముఖ్యంగా మహిళల పీరియడ్స్‌లో మార్పులకు .. టీకాకు సంబంధం ఉందా ? అనే కోణంలోనూ ఇంకా బోలేడన్ని అపోహలు ఉన్నాయి. దీంతో వ్యాక్సిన తీసుకోవడానికి యువతతోపాటు.. మహిళలు కూడా సందేహిస్తున్నారు.
అయితే మహిళలలో పీరియడ్స్ మార్పులకు.. టీకాకు సంబంధం ఉందా ? అనే కోణంలో చాలా పరిశోధనలు జరిగాయి. ఇటీవల బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక ఎడిటోరియల్లో కూడా మహిళల రుతుక్రమంలో మార్పులకు.. టీకాకు సంబంధం ఉండోచ్చని అభిప్రాయపడింది. కోవిడ్ టీకా తీసుకునన తర్వాత తలెత్తే సాధారణ సమస్యల జాబితాలో అనూహ్యంగా… పీరియడ్స్/ వజైనల్ బ్లీడింగ్ అవుతుందని ఇప్పటివరకు ఏ పరిశోధనలో బయటపడలేదని అమెరికాలోని ఇంపీరియల్ కాలేజ్, లండన్‌లో రిప్రొడక్టివ్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న విక్టోరియా మేల్ ఎడిటోరియల్ పేర్కోంది. ప్రతికూల ఔషధ రియాక్షన్ కోసం ఏర్పాటైన నిఘా /పర్యవేక్షణ పథకం యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులటరీ ఏజెన్సీకు సెప్టెంబర్ 2 నాటికి 30,000 పైగా రిపోర్ట్స్ అందాయని విక్టోరియా చెప్పుకొచ్చారు. ఆ అన్ని రిపోర్టులలో టీకా తీసుకున్న తర్వాత పీరియడ్స్ రావడం లేదా వజైనల్ బ్లీడింగ్ కావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించినట్లు మహిళలు పేర్కొన్నారు. మళ్లీ తర్వాతీ నెలలో పీరియడ్స్ యధావిథిగా వచ్చినట్లు చాలా మంది మహిళలు తెలిపారని విక్టోరియా చెప్పుకోచ్చారు. అలాగే మహిళల సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా మహిళల రుతుస్రావంపై ప్రభావం ఉంటుందనే అనుమానాన్ని నివృత్తి చేస్తూ.. ఈ విషయంలో మరింత లోతైన అధ్యయనం చేయాలన్నారు.
ఇక పీరియడ్స్ మార్పులు.. టీకాల మధ్య సంబంధం ఉందని చెప్పడానికి తమ పర్యవేక్షణ డేటా మద్దతు ఇవ్వదని ఎంహెచ్ఆర్ఏ పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న స్త్రీలలో పీరియడ్స్ మార్పులు ఉన్నాయని చెప్పిన వారు చాలా తక్కువగా ఉన్నారని.. అందుకే ఆ రెండింటి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి సరైన కారణాలు లేవని ఎంహెచ్ఆర్ఏ తెలిపింది. ఇక ఇప్పటివరకు వచ్చిన నివేధిక ప్రకారం టీకా వలన పీరియడ్స్ మార్పులు రావడం చెప్పడం కూడా కష్టమే అని ఆమె అన్నారు. ఈ విషయంపై సరైన స్పష్టత రావడానికి టీకా తీసుకున్నవారు.. తీసుకోని వారిలో పీరియడ్స్ మార్పులను పోల్చీ చూడాల్సిని అవసరం ఉందన్నారు. ఎంఆర్ఎన్ఏ, అడినోవైరస్ టీకాలు వేసుకున్న స్త్రీలలో పీరియడ్స్ మార్పులు ఉన్నాయని .. గత రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయని.. దీన్ని బట్టి వ్యాక్సిన్‌కు రోగ నిరోధక ప్రతిస్పందన ఫలితంగా పీరియడ్స్ మార్పులు వచ్చాయని అనుకోవచ్చని.. ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే వ్యాక్సిన్ లో ఉండే పదార్థాల కారణంగానూ పీరియడ్స్ మార్పులు రాకపోవచ్చునని తెలిపారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సోకిన మహిళల్లో నాలుగింట ఒక వంతు స్త్రీలలో పీరియడ్స్ మార్పులు జరిగినట్లుగా గతంలో ఓ అధ్యయనంలో వెల్లడైందని.. వైరస్ తీసుకున్న తర్వాత రోగనిరోధకశక్తిలో మార్పు పీరియడ్స్ మార్పులకు కారణం కావచ్చన్నారు. ఇక పీరియడ్స్ మార్పులు లేదా వజైనల్ బ్లీడింగ్ గురించి మహిళలకు సరైన అవగాహన కలిగిలా వైద్యులు మరింత చొరవ చూపాలని ఆమె తెలిపారు.
Also Read: Viral Photo: కొండల మధ్య దాక్కున్న మంచు చిరుతను కనిపెట్టండి.. ఈ ఫోటోలో ఎక్కడుందో గుర్తించండి!