AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ? అయితే మీకు షాకింగ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. రోజూ రోజూకీ చలి ఎక్కువవుతుండడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా

చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ? అయితే మీకు షాకింగ్ న్యూస్..
Alcohol
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2021 | 7:10 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. రోజూ రోజూకీ చలి ఎక్కువవుతుండడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక చలి తీవ్రత పెరుగుతుండడంతో ఇటు మద్యం అమ్మకాలు కూడా పెరిగాయి సాధారణంగా ఆల్కహాల్, సిగరెట్ తాగడం వలన శరీరం వేడిగా మారుతుందని అంటుంటారు. ముఖ్యంగా మద్యం తాగిన వ్యక్తి శరీరం పూర్తిగా వెచ్చబడి ఉంటుంది. కానీ నిజానికి అల్కహాల్ బాడీ కోర్ టెంపరేచర్‏ను తగ్గిస్తుంది. అయితే ఎక్కువ శాతం మంది ఆల్కహాల్ తాగితే శరీరం వెచ్చగా ఉంటుందని అనుకుంటుంటారు.

కానీ తాజా నివేదికల ప్రకారం విస్కీ లేదా రమ్ తాగితే బాడీ వెచ్చగా ఉండదు. ముందు శరీరం వెడెక్కినట్టు అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత శరీరం చల్లబడుతుది. దీంతో ఆల్కహాల్ చలిని తట్టుకునే శారీరక సామర్థ్యాన్ని కూడా బలహీనపరుస్తుంది. సాధారణంగా చలికాలంలో నీరు తాగడం తగ్గిస్తారు. దీంతో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. నీరు తాగడం మానేసిన తర్వాత అనారోగ్య సమస్యలు కల్గుతాయి. చలికాలంలో నీరు ఎక్కువగా తాగడం మంచిది. ఒకవేళ నీరు తీసుకోవడం మానేస్తే ఆకలి పెరుగుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

చలికాలంలో శరీరంలో నుంచి చెమటగానీ, నీరు గానీ బయటకు రాదు. అందుకే ఎక్కువ నీరు తాగాల్సిన అవసరం లేదనుకుంటారు. చలికాలంలో గాలి చాలా పొడిగా ఉంటుంది. దీంతో గాలి నుంచి తేమ శరీరానికి చేరదు. చలికాలంలో మద్యం తాగడం వలన శరీరం చల్లగా మారుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి. ఆల్కహాల్ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఒకవేళ శరీరంలోకి చేరకపోతే.. శరీర ద్రవం తగ్గుతుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..