Coriander Leaves: చలికాలంలో కొత్తిమీర ఆకులను తింటే బరువు తగ్గుతారా ?.. అసలు విషయాలను తెలుసుకోండి..

కొత్తిమీర వంటకాల రుచిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కేవలం రుచి మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను

Coriander Leaves: చలికాలంలో కొత్తిమీర ఆకులను తింటే బరువు తగ్గుతారా ?.. అసలు విషయాలను తెలుసుకోండి..
Coriander Leaves
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2021 | 3:27 PM

కొత్తిమీర వంటకాల రుచిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కేవలం రుచి మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. సాధరణంగా కొత్తిమీర తింటే కంటి సమస్యలను తగ్గుతాయి అంటారు. అలాగే కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, కె, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో కేలరీలు సైతం తక్కువగా ఉంటాయి.

ఒక కప్పు పచ్చి కొత్తిమీరలో 0.0083 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది కాకుండా.. 0.587 గ్రాములు మాత్రమే ఉంటుంది. కొత్తిమీర గుండె, మధుమేహం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొత్తిమీర ఆకులను తీసుకోవడం వలన చర్మం మృదువుగా ఉంటుంది. మొటిమలు.. బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గించడంలోనూ కొత్తిమీర ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే చలికాలంలో కొత్తిమీర ఆకుల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.

కొత్తి్మీర ఆకులను తీసుకోవడం వలన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ అంటే హెచ్డీఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతోపాటు.. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ పరిమాణం తగ్గుతుంది. దీంతో చలికాలంలో కొత్తిమీర ఆకులను తీసుకుంటే గుండె జబ్బులు తగ్గుతాయి. కొత్తిమీర కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనాలను అందిస్తుంది. కొత్తిమీర ఇన్సులిన్ విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అలాగే కొత్తిమీర ఆకులను తీసుకోవడం వలన జీర్ణశక్తి బలపడుతుంది. కొత్తిమీర కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది గ్యా్స్, మలబద్ధకం, ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది.

కొత్తిమీరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. వాపు సమస్యలను తగ్గించడంలో కొత్తిమీర ఎక్కువగా సహాయపడుతుంది. కీళ్ల నొప్పులకు ప్రధాన కారణం.. కీళ్ల మధ్య మంట రావడమే. ఈ సమయంలో కొత్తిమీర ఆకులు కీళ్ల సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. ఇక రక్తహీనతతో బాధపడేవారికి కొత్తిమీర మంచి ఔషదంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ అధిక మొత్తంలో లభిస్తుంది. దీంతో ఐరన్ లోపాన్ని సులవుగా జయించవచ్చు. ఐరన్ లోపాన్ని అధిగమిస్తే రక్తహీనత సమస్య తగ్గుతుంది.

Also Read: Bandla Ganesh: న్యాయానికి .. ధర్మానికి రోజులు లేవు అంటున్న బండ్లగణేష్.. కారణం ఏంటంటే..

Shivani – Shivathmika: మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్న సీనియర్ హీరో కుమార్తెలు.. కోలీవుడ్‌లోకి ఎంట్రీ..