AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone: మీ పిల్లలు తరచూ స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

ఇప్పుడు స్మార్ట్‎ఫోన్ ప్రతీ ఒక్కరు వాడుతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అధికంగా వాడడం ప్రమాదకరమే.. అందులో పిల్లలకు మరింత ప్రమాకరం....

Smart Phone: మీ పిల్లలు తరచూ స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా.. అయితే ఇలా చేయండి..
Smart Phone
Srinivas Chekkilla
|

Updated on: Dec 23, 2021 | 2:54 PM

Share

ఇప్పుడు స్మార్ట్‎ఫోన్ ప్రతీ ఒక్కరు వాడుతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అధికంగా వాడడం ప్రమాదకరమే.. అందులో పిల్లలకు మరింత ప్రమాకరం. కానీ ఇప్పుడు ఒక సంవత్సరం పిల్లాడి నుంచి 20 ఏళ్ల కుర్రాడి వరకు మొబైల్‎ను అధికంగా వినియోగిస్తున్నారు. కొందరు పిల్లలు ఉదయం లేచింది మొదలు  రాత్రి పడుకునే వరకు ఫోన్‎తోనే గడుపుతున్నారు. స్మార్ట్ ఫోన్ అధిక వాడకంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఫోన్ అలవాటైన తర్వాత దానిని దూరం చేయడం కష్టంగా మారుతుంది. చాలాసార్లు ఫోన్లు లాగేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఏడవడం, కోపంతో వస్తువులు విసిరివేయడం చేస్తుంటారు. పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ వైపు చూస్తుంటే వచ్చే అనర్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బాల్యంలో పిల్లల మెదడు అభివృద్ధి చెందే సమయం. ఆ సమయంలో మొబైల్‎లో వచ్చే అనవసర విషయాలు మెదడు పనితీరు మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‎ఫోన్ నుంచి వచ్చే కిరణాలు పిల్లల కాళ్లకే కాదు మెదడు కణాలకు కూడా హానికరమే. ఫోన్ తరచూగా చూస్తే వారు బాహ్యప్రపంచంతో వేరు అవుతారు. ఇలా వారికి లోకం ఏంటో తెలియదు.

మొదటగా పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దు. ఒకవేళ ఇచ్చినా చాలా తక్కువ సమయం ఇవ్వాలి. పిల్లలు ఎంతసేఫు ఫోన్ వాడుతున్నారనేది పెద్దలు గమనిస్తూ ఉండాలి. మెసేజ్ చేస్తున్నారా? లేక కాల్స్ మాట్లాడుతున్నారా? ఎంతసేపు మాట్లాడుతున్నారనేది తెలుసుకోవాలి. వారిని వీలైనంత ఎక్కువ సేపు బయటకు తీసుకెళ్లాలి. మైదనానికి, షాపింగ్‎కు ఇలా బయటకు తీసుకెళ్లడం ద్వారా వారి మనస్సు డైవర్ట్ చేయొచ్చు.

పిల్లలకి ఆన్ లైన్ క్లాసులు ఉన్నట్లయితే కళ్లకి రక్షణ ఇచ్చే అద్దాలు తీసుకురావాలి. ఆన్ లైన్ క్లాసులకి తప్ప మిగతా పనులకి ఫోన్లని చేతికి ఇవ్వకూడదు. అదే కాదు ఏదైనా శారీరక శ్రమ కలిగించే ఆటల్లో భాగస్వాములని చేయాలి.లౌడ్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడేలా ప్రోత్సహించాలి. అలాగే చెవికి దగ్గరగా పెట్టుకోవద్దని సూచించాలి. రాత్రిపూట ఫోన్ అస్సలు ముట్టుకోనివద్దు.

Read Also.. Ludhiana Blast: పంజాబ్‌లోని లూథియానా కోర్టులో పేలుడు.. ఇద్దరు మృతి..!