AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Color Rice Benefits: మీకు తెలుసా? బియ్యంలోనూ రంగులుంటాయి.. ఏ రంగు ఎటువంటి ప్రయోజనం ఇస్తుందంటే..

సాధారణంగా చాలా మంది ఎక్కువగా తెల్ల బియ్యం మాత్రమే తింటుంటారు.. అందరి ఇళ్లలోనూ ఇవే ఉంటాయి.. బియ్యంలో

Color Rice Benefits: మీకు తెలుసా? బియ్యంలోనూ రంగులుంటాయి.. ఏ రంగు ఎటువంటి ప్రయోజనం ఇస్తుందంటే..
Rice
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2021 | 5:23 PM

Share

సాధారణంగా చాలా మంది ఎక్కువగా తెల్ల బియ్యం మాత్రమే తింటుంటారు.. అందరి ఇళ్లలోనూ ఇవే ఉంటాయి.. బియ్యంలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా తక్కువగా పాలిష్ చేసిన బియ్యం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బియ్యంలోనూ రంగులుంటాయన్న సంగతి తెలుసా ?.. ఇటీవల కాలంలో బ్రౌన్ రైస్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని… ముఖ్యంగా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని అంటుంటారు.. అలాగే.. బ్లాక్ రైస్.. రెడ్ రైస్ ఇలా రంగురంగుల బియ్యం కూడా ఉంటాయి. ఈ రంగు రంగుల బియ్యం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా..

బ్లాక్ రైస్.. (నల్ల బియ్యం) బ్లాక్ రైస్.. ఇవి నల్లగా ఉంటాయి.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ.. కూడా పుష్కలంగా ఉంటుంది. తెల్ల బియ్యం మాదిరిగానే నల్ల బియ్యం కూడా ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం.. నల్ల బియ్యం.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడమే కాకుండా.. బరువు కూడా తగ్గిస్తాయి.

రెడ్ రైస్.. (ఎర్ర బియ్యం) రెడ్ రైస్.. కాస్త.. బ్రౌన్ రైస్ కంటే కాస్త వేరుగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి తిన్న తర్వాత ఆకలిగా అనిపించదు.. అలాగే.. రక్తపోటును నియంత్రిస్తుంది.. బరువు తగ్గించడంలోనూ బియ్యం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

బ్రౌన్ రైస్.. బ్రౌన్ రైస్.. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. షుగర్ ఉన్నవారు బ్రౌన్ రైస్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో తెల్ల బియ్యం కంటే ఎక్కువగా పోషకాలున్నాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి… అయితే కేలరీలు మాత్రం తెల్ల బియ్యంలో ఉన్నట్టుగానే ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడమే కాకుండా.. బరువును కూడా తగ్గిస్తాయి.

వైట్ రైస్.. (తెల్ల బియ్యం) సాధారణంగా అందరి ఇళ్లలో ఉపయోగించేవి తెల్ల బియ్యం మాత్రమే. ఇందులో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ.. మిగిలిన బియ్యం కంటే.. తక్కువగా ఉంటాయి… ఇందులో కాల్షియం.. ఫోలేట్ చాలా ఎక్కువగా ఉంటుంది.

Also Read: Bigg Boss 5 Telugu Promo: అడగండి.. లాక్కోండి.. దొంగిలించండి.. ఇంటి సభ్యులను ముప్పుతిప్పలు పెట్టిన నాగ్..

Trailer Talk: నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న ఎనిమి ట్రైలర్.. విశాల్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా..