AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీరు నిద్ర లేవగానే బెడ్ టీ తాగుతున్నారా.. అయితే మీరు స్లో పాయిజన్ తాగుతున్నట్లే..

చాలామందికి తమ రోజును ఒక కప్పు ‘చాయ్’తో మొదలు పెడుతుంటారు. అదే పెద్ద అలావాటుగా మార్చుకుంటారు. అందులోనూ పొగలుకక్కే చాయ్‌ తాగడానికి భలే ఇష్ట పడుతుంటారు.

Health Tips: మీరు నిద్ర లేవగానే బెడ్ టీ తాగుతున్నారా.. అయితే మీరు స్లో పాయిజన్ తాగుతున్నట్లే..
Chai
Sanjay Kasula
|

Updated on: Oct 24, 2021 | 2:42 PM

Share

చాలామందికి తమ రోజును ఒక కప్పు ‘చాయ్’తో మొదలు పెడుతుంటారు. అదే పెద్ద అలావాటుగా మార్చుకుంటారు. అందులోనూ పొగలుకక్కే చాయ్‌ తాగడానికి భలే ఇష్ట పడుతుంటారు. ఇది మలబద్దకానికి కూడా కారణంగా మారుతుందని.. ఇలా తాగడం వల్ల ప్రేగులపై ప్రభావం చూపుతుందని ఓ నివేదిక హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయని అంటున్నారు. చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీలో 20 నుంచి 60 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ఆరోగ్యానికి మంచిది కాదు.  ఇలా మీరు క్రమం తప్పకుండా టీ తాగుతున్నట్లైతే ఈ కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకోండి.

మీరు ఏదైనా వ్యాధికి ఔషధం తీసుకుంటున్నట్లైతే టీ తాగడం వెంటనే మానుకోండి.  క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి, రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్తపోటు పెరుగుతుంది. అసిడోసిస్ పెరుగుతుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఊబకాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే నిరంతరం టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి.

ఉదయం టీ ఎంత మంచిది?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఇలాంటప్పుడు ఉదయాన్నే టీ తాగే ముందు గోరువెచ్చని లేదా సాదా నీరు తాగండి, ఆ తర్వాత టీ తాగండి, లేకుంటే అల్పాహారంగా కొన్ని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుని ఆ తర్వాత టీ తాగండి.

టీకి ముందు నీళ్లు ఎందుకు తాగాలి?

నిజమే శరీరానికి రాత్రంతా నీరు అందదు. దీని వలన శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. ఈ సందర్భంలో ఉదయం నిద్రలేచిన తర్వాత  నీరు మాత్రమే తాగాలి. నీటి తర్వాత టీ తాగితే దాని నష్టం కొంత వరకు తగ్గుతుంది.

టీని తక్కువగా ఉడకబెట్టండి

ఎక్కువగా తయారుచేసిన టీని తాగడం వల్ల టీలో నికోటినామైడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నిల్వ ఉంచిన టీని మళ్లీ వేడి చేసి వాడకూడదు. ఇది స్లో పాయిజనింగ్ కంటే తక్కువేమి కాదు. వీలైనంత వరకు తాజా టీ మాత్రమే తాగండి. ఎక్కువ పాలతో టీకి బదులుగా గ్రీన్ టీని ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి: India Pakistan, T20 World Cup LIVE Streaming: బిగ్‌ సండే.. బిగ్‌ ఫైట్‌.. మ్యాచ్ ఎక్కడ, ఎలా చూడాలో తెలుసా..

Ind Vs Pak: భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ