AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water: మనిషి రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా? రీసెర్చ్ ఏం చెప్పిందంటే..!

సకలకోటి ప్రాణికి జీవనాధారం నీరు. మానవాళి జీవితమంతా నీటితోనే ముడిపడి ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్ ఎక్కువ తాగమని ప్రతి డాక్టర్ చెబుతారు. బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచమని సలహా ఇస్తూ ఉంటారు. శరీరానికి వ్యవస్థ సరిగ్గా నడవాలంటే వాటర్ చాలా ముఖ్యమన్నదీ వారు చెప్పే మాట. అయితే రోజుకు ఎన్ని లీటర్లు నీర్లు తాగలన్నా విషయంపై చాలామందికి క్లారిటీ లేదు.

Drinking Water: మనిషి రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా? రీసెర్చ్ ఏం చెప్పిందంటే..!
Drinking Water
Ranjith Muppidi
| Edited By: |

Updated on: May 11, 2024 | 4:08 PM

Share

సకలకోటి ప్రాణికి జీవనాధారం నీరు. మానవాళి జీవితమంతా నీటితోనే ముడిపడి ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే వాటర్ ఎక్కువ తాగమని ప్రతి డాక్టర్ చెబుతారు. బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచమని సలహా ఇస్తూ ఉంటారు. శరీరానికి వ్యవస్థ సరిగ్గా నడవాలంటే వాటర్ చాలా ముఖ్యమన్నదీ వారు చెప్పే మాట. అయితే రోజుకు ఎన్ని లీటర్లు నీర్లు తాగలన్నా విషయంపై చాలామందికి క్లారిటీ లేదు. కొందరు ఎక్కువ తాగితే.. మరికొందరు తక్కువ తాగుతూ ఉంటారు. సాధారణ వ్యక్తి హెల్దీగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీళ్లు.. అంటే 2-3 లీటర్ల నీటిని తాగాలని అమెరికా సైంటిస్టులు చేసిన రీసెర్చ్‌లో తేలింది. అయితే వేడి, ఉక్క ప్రదేశాల్లో పనిచేసేవారు, ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నవారు.. ఈ లిమిట్‌ను ఇంకొంత పెంచుకోవచ్చు. అంతేకానీ.. డైలీ తీసుకునే వాటర్ మొత్తంగా తక్కువ, ఎక్కువ కాకూడదని వెల్లడించారు. ఎందుకంటే ఆ విధంగా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్య లు తలెత్తే అవకాశం ఉందన్నారు.

అమెరికాలోని “నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌”కు చెందిన సైంటిస్టులు.. రోజూ సరిపడినంత వాటర్ తాగడం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుందా అనే అంశంపై రీసెర్చే చేశారు. దాదాపు 30 సంవత్సరాల పాటు నిర్వహించిన ఈ పరిశోధనలో 11,255 మంది పాల్గొన్నారు. 30-45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి హెల్త్ అప్ డేట్స్ అన్నీ సేకరించారు. ఆపై.. వారికి ’70-90 ఏళ్ల’ వయసుకు వచ్చాక మరోసారి హెల్త్ డేటా తీసుకుని.. ఆ వివరాలన్నింటినీ “ఇ బయోమెడిసిన్‌” మెడికల్ జర్నల్ ప్రచురితం చేశారు.

నీరు ఎక్కువ తాగినా అవేమీ శరీరంలో నిల్వ ఉండవు. బయటకు వెళ్లిపోవాల్సిందే. పైగా ఆ వాటర్​ను వడకట్టడానికి కిడ్నీలు ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి.. ఈ ప్రాబ్లం లేకుండా ఎప్పుడు దాహమేస్తే అప్పుడు నీరు తాగడాన్ని అలవాటు చేసుకోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలానే నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు.. కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండాలి..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…