Health: ఈ ఆకులు చాలా వ్యాధులకు నేచురల్ మెడిసిన్.. రోజూ 2 నమిలితే అన్నీ పరార్

సాదారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివి..అందుకే రోజుకో పండు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతుంటారు. కానీ జామ ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా? మనం పండ్లపై పెట్టే శ్రద్ధ ఆకులపై పెట్టం. ఈ జామ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల తెలుసుకుందాం..

Health: ఈ ఆకులు చాలా వ్యాధులకు నేచురల్ మెడిసిన్.. రోజూ 2 నమిలితే అన్నీ పరార్
Guava Leaf
Follow us

|

Updated on: Apr 17, 2024 | 7:15 PM

జామ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి దాదాపు మనందరికీ తెలుసు. అయితే జామ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అవును, జామ ఆకులు కూడా చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు, ప్రొటీన్, విటమిన్ సి , విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, గల్లిక్ యాసిడ్, ఫినాలిక్ సమ్మేళనాలు వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.  జామ ఆకులను నీటిలో  మరిగించడం ద్వారా తయారు చేసిన ద్రావణాన్ని తాగడం లేదా పచ్చి ఆకులను నమలడం ద్వారా  అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది:

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం లేదా దాని కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అవును ఈ ఆకులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది:

డయాబెటిక్ రోగులకు జామ ఆకులు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. ఇందులోని ఫినాలిక్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం అదుపులో ఉండాలంటే జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ కషాయాన్ని రోజూ తాగండి.

హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది:

జామ ఆక  డికాషన్ రక్తహీనతకు మంచి ఔషధం. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. అలాగే ఇది డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది.

నోటి పూతలకి చికిత్స:

శరీర ఉష్ణోగ్రత పెరిగి తరచుగా నోటిలో, నాలుకలో పుండ్లు లేదా బొబ్బలు వస్తుంటే.. జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

జామ ఆకు ఒక సహజమైన డిటాక్స్ డ్రింక్. ఇది మీ శరీరం నుండి విషాన్ని,  హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చల నుండి ఉపశమనం పొందవచ్చు.

బరువు తగ్గడంలో సహాయం:

బరువు తగ్గడానికి జామ ఆకులు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ ఆకులను తినడం లేదాఆకులతో చేసిన డికాషన్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అలాగే జామ ఆకుల ద్రావకం శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. దీని వల్ల బరువు కూడా తగ్గి శరీరం ఫిట్ గా కనిపిస్తుంది.

జలుబు,  దగ్గుకు మంచి మెడిసిన్:

జామ ఆకులు జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఈ ఆకుల్లో ఉండే విటమిన్ సి, ఐరన్ సీజనల్ ఫీవర్,  ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)