AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamun Seeds Benefits: మధుమేహానికి అద్భుత ఔషధం.. ఎలా మ్యాజిక్ చేస్తుందో తెలుసా..?

మధుమేహం నియంత్రణ కు సహజ మార్గాల వైపు మొగ్గు చూపే వారి కోసం నేరేడు గింజల పొడి ఒక పవర్‌ ఫుల్ ఆయుర్వేద పరిష్కారం. ఇది చక్కెర స్థాయిని సమతుల్యం చేయడమే కాదు.. ప్యాంక్రియాస్ పని తీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

Jamun Seeds Benefits: మధుమేహానికి అద్భుత ఔషధం.. ఎలా మ్యాజిక్ చేస్తుందో తెలుసా..?
Jamun Seeds Powder
Prashanthi V
|

Updated on: Jul 10, 2025 | 7:37 PM

Share

ప్రస్తుత రోజుల్లో మధుమేహం ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేస్తున్న ఒక పెద్ద ఆరోగ్య సమస్య. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలను సురక్షితంగా నియంత్రించేందుకు ఆయుర్వేద పద్ధతులపై ఆసక్తి బాగా పెరుగుతోంది. అలాంటి సహజమైన పరిష్కారాలలో ఒకటి నేరేడు గింజల పొడి. ఇది మన ఇండియాలో శతాబ్దాలుగా వాడుకలో ఉన్న ఒక సాంప్రదాయ ఔషధ పదార్థం.

నేరేడు గింజలలో జాంబోలిన్, జాంబోసిన్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అందుకే ఇది మధుమేహంతో బాధపడేవారికి ఒక సహజమైన మద్దతుగా నిలుస్తోంది.

ఎలా పనిచేస్తుంది..?

  • నేరేడు గింజలలో ఉండే జాంబోలిన్ అనే పదార్థం మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పిండి పదార్థాలను శరీరం చక్కెరగా మార్చే ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీని వల్ల భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చు.
  • ఇక జాంబోసిన్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం ఇన్సులిన్‌కు మరింత సున్నితంగా స్పందించేలా చేయడమే కాకుండా.. ప్యాంక్రియాస్ ద్వారా సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
  • నేరేడు గింజల పొడిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలేయం, కిడ్నీలు వంటి ముఖ్యమైన అవయవాలను రక్షించడంలో తోడ్పడతాయి. మధుమేహం దీర్ఘకాలం ఉన్నవారిలో ఈ అవయవాలపై తరచుగా ఒత్తిడి పడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారికి ఎలా సహాయపడుతుంది..?

  • ఇన్సులిన్‌కు శరీరం స్పందించేలా చేయడం.. ఇది గ్లూకోజ్‌ ను శరీరం కణాలలోకి సరిగ్గా గ్రహించుకునే విధంగా సహాయపడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • అన్నం లేదా ఇతర కార్బోహైడ్రేట్లు తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నియంత్రించగలదు.
  • ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్‌ను తయారు చేసే బీటా కణాలు తిరిగి బాగా పనిచేయడానికి నేరేడు గింజల పొడి సహాయపడగలదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల ప్యాంక్రియాస్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
  • నేరేడు గింజల పొడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, వాపును తగ్గించే గుణాలు.. కాలేయం, కిడ్నీలు వంటి ముఖ్యమైన అవయవాలను మధుమేహం వల్ల కలిగే నష్టం నుండి కాపాడటానికి సహాయపడతాయి.
  • మధుమేహ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం.. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల నరాల బలహీనత, కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు వంటి మధుమేహం వల్ల వచ్చే తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఎలా వాడాలి..?

  • నేరేడు గింజల పొడిని సాధారణంగా రోజుకు 1 నుంచి 2 టీ స్పూన్లు తీసుకోవడం మంచిది. అయితే మీరు ఇప్పటికే డయాబెటిస్‌ కు మందులు
  • వాడుతున్నట్లయితే.. తప్పకుండా వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు వాడాలి.
  • ఉదయం లేదా భోజనానికి ముందుగా గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు.
  • స్మూతీలు, పెరుగు, లేదా సలాడ్లలో కలిపి కూడా తీసుకోవచ్చు.
  • చేదు రుచి ఇష్టం లేని వారికి క్యాప్సూల్స్ రూపంలో కూడా లభిస్తుంది.
  • భోజనానికి ముందుగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
  • కొన్ని ఆయుర్వేద పద్ధతులు ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణ శక్తి మెరుగుపడుతుందని సూచిస్తున్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • నేరేడు గింజల పొడి సాధారణంగా సురక్షితమైనదే అయినప్పటికీ.. కొన్ని పరిస్థితులలో జాగ్రత్తలు అవసరం
  • ఇన్సులిన్ లేదా ఇతర చక్కెర మందులతో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా తగ్గిపోవచ్చు.
  • కొందరికి ఇది స్వల్ప జీర్ణ సమస్యలు లేదా మలబద్ధకానికి కారణం కావచ్చు.
  • కొందరికి అలెర్జీ కూడా కలగవచ్చు.
  • ఇది డయాబెటిస్ మందుల ప్రభావాన్ని మార్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం.
  • గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు.. నేరేడు గింజల పొడిని వాడే ముందు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి.

2 నుంచి 4 వారాల్లో ఎలాంటి మార్పులు కనిపించవచ్చు..?

  • రక్తంలో చక్కెర స్థాయిలలో స్వల్ప మెరుగుదల.
  • తీపి తినాలనే కోరిక తగ్గడం.
  • శారీరక ఉత్సాహం, దృష్టి స్పష్టతలో మెరుగుదల.

8 నుంచి 12 వారాల్లో ఎలాంటి మార్పులు కనిపించవచ్చు..?

  • HbA1c స్థాయిలో మెరుగుదల.. ఇది మూడు నెలల సగటు చక్కెర స్థాయిని చూపే పరీక్ష. నేరేడు గింజల పొడి వాడకంతో ఈ స్థాయిలో మంచి మార్పు కనిపిస్తుంది.
  • ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడుతుంది.
  • కాలేయం, కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది.

నేరేడు గింజల పొడి షుగర్‌ను అదుపు చేయడానికి వాడే మందులతో పాటు తీసుకోవచ్చు. అయితే ఇది డాక్టర్లు ఇచ్చిన మందులకు బదులు కాదు.. కేవలం తోడుగా మాత్రమే వాడాలి. సరైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, డాక్టర్ పర్యవేక్షణతో పాటు దీన్ని వాడితే మంచి ఫలితాలు చూడవచ్చు. మీరు నేరేడు గింజల పొడిని వాడటం మొదలుపెట్టే ముందు తప్పకుండా మీ వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..