AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్నవారు ఇవి తింటే కంట్రోల్ లో ఉంటది.. ఇక టెన్షన్ పడాల్సిన పనిలేదు..!

రక్తంలో షుగర్ పెరగడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. షుగర్ జబ్బు ఉన్నవారికి మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా తిన్న తర్వాత గ్లూకోజ్ అటూ ఇటూ మారుతుంది. దీన్ని సరిచేయడానికి మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ఎంత అవసరమో.. మనం తినే ఆహారంలో కొన్ని మంచి పదార్థాలను చేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ నియమాలు పాటిస్తే మీరు షుగర్ స్థాయిలను బాగా అదుపు చేసుకోవచ్చు.

షుగర్ ఉన్నవారు ఇవి తింటే కంట్రోల్ లో ఉంటది.. ఇక టెన్షన్ పడాల్సిన పనిలేదు..!
Diabetes
Prashanthi V
|

Updated on: Jun 23, 2025 | 11:01 PM

Share

కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఉదాహరణకు గుడ్లు, పనీర్, చికెన్, శనగలు లాంటి ప్రోటీన్ ఉన్న పదార్థాలు అరిగే ప్రక్రియను సమతుల్యం చేస్తాయి. ఇవి గ్లూకోజ్‌ ను నెమ్మదిగా రక్తంలోకి పంపుతాయి. దాంతో తిన్న వెంటనే షుగర్ పెరగదు.

ఆకుకూరలు, కూరగాయలు, శనగలు, బీన్స్ లాంటి వాటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం కార్బోహైడ్రేట్లను ఎలా పీల్చుకుంటుందో దానిపై ప్రభావం చూపుతుంది. ఫైబర్ ఉన్న ఆహారం వల్ల రక్తంలోని షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా.. స్థిరంగా ఉంటాయి.

సాధారణంగా కొవ్వులు అంటే దూరంగా ఉండాలనిపిస్తుంది. కానీ ఆలివ్ ఆయిల్, అవకాడో, బాదం, వాల్‌ నట్స్ లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు షుగర్ స్థాయిలపై ప్రభావం చూపవు. అవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సాయపడతాయి.

చిన్న మోతాదులో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్‌ ను మీ భోజనంలో కలిపితే ఆహారం షుగర్‌ ను పెంచే గుణం తగ్గుతుంది. అంటే అదే ఆహారం తిన్నా షుగర్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇది ముఖ్యంగా బ్రెడ్, బియ్యం, పోహా లాంటి ఆహారాలపై బాగా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్‌ కు శరీరం స్పందించే విధానాన్ని మెరుగుపరుస్తుంది.

రోజంతా కొద్ది కొద్దిగా తింటూ ఉండటం వల్ల శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఒక్కసారిగా ఎక్కువగా తినడం వల్ల షుగర్ ఒక్కసారిగా పెరగడం సాధారణం. ఇది రాకుండా ఉండాలంటే.. సరైన సమయానికి చిన్నపాటి టిఫిన్లు, మధ్యాహ్న భోజనం, తక్కువ సాయంత్రం భోజనం తీసుకోవడం మంచిది.

చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్ లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్ లాంటివి రక్తంలో షుగర్ స్థాయిని వేగంగా పెంచుతాయి. చాలా చోట్ల చక్కెర నేరుగా కనిపించకపోయినా.. ప్యాక్ చేసిన పదార్థాల్లో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, షుగర్ లాంటి పదార్థాలు కలిసి ఉంటాయి. ఇవి కూడా షుగర్‌ ను వేగంగా పెంచుతాయి. కాబట్టి వాటిని పూర్తిగా తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసుకోవాలంటే రోజువారీ తినే అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే చాలు. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఫైబర్, మంచి కొవ్వులు, సహజమైన రుచులు వాడటం ద్వారా షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ సూచనలను పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు