AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఒక్క చెంచాతో డజనుకు పైగా రోగాలు నయం.. ఈ గింజల పొడి అద్భుత ఔషధం..

వేసవిలో లభించే తీపి, పుల్లని నేరేడు పండు మనకు తెలిసిందే. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే నేరేడు పండు గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. నేరేడు పండ్లను చాలామంది వేసవిలో తిని, వాటి గింజలను పారవేస్తారు. కానీ, నేరేడు గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని మీకు తెలుసా? అవును, నేరేడు పండు మాదిరిగానే దాని గింజలలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు నేరేడు గింజలను పొడిగా మార్చుకుని వాడవచ్చు. ఈ నేరేడు గింజల పొడి మధుమేహం, రక్తపోటు రోగులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పొడి జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరుస్తుంది.

Health Tips: ఒక్క చెంచాతో డజనుకు పైగా రోగాలు నయం.. ఈ గింజల పొడి అద్భుత ఔషధం..
Jamun Seeds Powder Health Benefits
Bhavani
|

Updated on: Jun 15, 2025 | 6:48 PM

Share

మీరు ప్రీ-డయాబెటిక్ లేదా మధుమేహ రోగి అయితే, నేరేడు గింజల పొడిని తీసుకోవచ్చు. నేరేడు గింజల పొడి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచటానికి సహాయపడుతుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఈ కారణంగా, మధుమేహ రోగులు నేరేడు గింజల పొడిని తీసుకుంటే, వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ప్రీ-డయాబెటిస్‌లో నేరేడు గింజల పొడిని వాడటం వల్ల మధుమేహం రాకుండా నివారించవచ్చు.

రక్తపోటు నియంత్రణ:

మీకు అధిక రక్తపోటు ఉంటే, నేరేడు గింజల పొడిని తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును నియంత్రించటానికి సహాయపడతాయి. అయితే, మీ రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటే, వైద్యుడి సలహా మేరకు మాత్రమే దీనిని తీసుకోవాలి.

శరీరాన్ని శుభ్రపరుస్తుంది (డిటాక్స్):

ఆరోగ్యంగా ఉండటానికి శరీరాన్ని కాలానుగుణంగా శుభ్రపరచటం (డిటాక్స్) చాలా ముఖ్యం. శరీరాన్ని డిటాక్స్ చేయటానికి తరచుగా సరైన ఆహార ప్రణాళికను పాటిస్తారు. ఒకవేళ మీరు మీ శరీరాన్ని డిటాక్స్ చేయాలనుకుంటే, ప్రతిరోజూ నేరేడు గింజల పొడిని తీసుకోవచ్చు. నేరేడు గింజల పొడి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించటానికి సహాయపడుతుంది. దీని కారణంగా, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మూత్రం ద్వారా సులభంగా బయటకు పోతాయి.

కాలేయం, గుండె ఆరోగ్యానికి:

నేరేడు గింజల పొడిలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించటానికి సహాయపడతాయి. ఈ పొడిని తీసుకోవటం వల్ల కాలేయ కణాలు రక్షింపబడతాయి. ఇది కాలేయం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి సహాయపడుతుంది. నేరేడు గింజల పొడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలేయం, గుండె వాపును తగ్గించటానికి సహాయపడతాయి. కాబట్టి, మీ గుండె, కాలేయం సరిగ్గా పనిచేయటానికి, మీరు నేరేడు గింజల పొడిని తీసుకోవచ్చు.

బరువు తగ్గటానికి సహాయకారి:

మీరు అధిక బరువుతో ఉంటే, నేరేడు గింజల పొడిని తీసుకోవచ్చు. ఈ పొడిని తినటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గటానికి సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ ఉదయం నేరేడు గింజల పొడిని తీసుకుంటే, అది బరువు తగ్గించటానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది, ఇది బరువు తగ్గటానికి ప్రయోజనకరం. కాబట్టి, మీరు కావాలంటే, మీ బరువు తగ్గించే ఆహారంలో నేరేడు గింజల పొడిని చేర్చుకోవచ్చు.

నేరేడు గింజల పొడిని తయారుచేసే విధానం:

నేరేడు గింజల పొడిని ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం నేరేడు గింజలను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి, ఆపై ఎండలో ఆరబెట్టండి. ఇప్పుడు వాటిని మిక్సీలో మెత్తగా రుబ్బుకోండి. మీరు కావాలంటే, నేరేడు గింజల పొడిని మార్కెట్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే