Hepatitis Warning Sign: హెపటైటిస్ వ్యాధి ఎయిడ్స్ కంటే ప్రమాదమైంది..! ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు
హెపటైటిస్ రోగుల్లో ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలన్న కోరిక తగ్గుతుంది. తక్కువగా తిన్నప్పటికీ కడుపు నిండిన ఫీల్ రావడం కూడా హెపటైటిస్ సంకేతమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, హైపటైటిస్‌తో ఇబ్బంది పడుతున్న రోగుల్లో కీళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటుంది. సాధారణ జ్వరం వచ్చినప్పుడు కలిగే నొప్పుల మాదిరిగానే ఉంటాయి.

హెపటైటిస్ ఉన్న వ్యక్తుల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం అలసట. ఎక్కువ విశ్రాంతి తీసుకున్నప్పటికీ నీరసంగా ఉంటారు. హెపటైటిస్ రోగుల్లో ఆకలి మందగిస్తుంది. ఆహారం తినాలన్న కోరిక తగ్గుతుంది. తక్కువగా తిన్నప్పటికీ కడుపు నిండిన ఫీల్ రావడం కూడా హెపటైటిస్ సంకేతమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, హైపటైటిస్‌తో ఇబ్బంది పడుతున్న రోగుల్లో కీళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటుంది. సాధారణ జ్వరం వచ్చినప్పుడు కలిగే నొప్పుల మాదిరిగానే ఉంటాయి.
కడుపు ఎగువ భాగంలో ముఖ్యంగా కుడి వైపున నొప్పి ఎక్కువగా ఉంటుంది. దీన్ని చాలా మంది గ్యాస్ట్రిక్, అజీర్తి వల్ల వచ్చిన నొప్పి అని అనుకుంటారు. దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు. హెపటైటిస్ ఉన్న రోగుల్లో కొంతమందికి చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మం ఎర్రగా మారడం, చర్మంపై దురద ఉంటుంది. అలాగే, హైపటైటిస్‌తో బాధపడుతున్న రోగుల్లో వాంతులు సమస్య తీవ్రంగా ఉంటుంది. నిరంతర వికారంగా ఉంటుంది.
హెపటైటిస్‌తో ఇబ్బందిపడుతున్న రోగుల్లో మూత్రం ముదురు రంగులో ఉంటుంది. శరీరంలో బైలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. తరుచుగా జ్వరం రావడం, ప్లూ లక్షణాలు కనిపించడం అనేది కూడా హెపటైటిస్ ముందస్తు సంకేతమే. హెపటైటిస్ ఉన్న రోగుల్లో సడన్‌గా బరువు తగ్గడం వంటి సమస్య ఉంటుంది. కాలేయ పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




