AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Relationships: నెగిటివ్ రిలేషన్‌ షిప్స్‌ కి కారణం ఏంటో మీకు తెలుసా..?

కొంత మంది వ్యక్తులు పదే పదే నష్టాన్ని కలిగించే సంబంధాల్లోనే చిక్కుకుంటూ ఉంటారు. ఎందుకిలా జరుగుతోంది..? అనే ప్రశ్న వారిని గందరగోళానికి గురి చేస్తుంది. అయితే ఇది పూర్తిగా వారి తప్పే అనుకోవడం సరికాదు. ఈ పరిస్థితి వెనుక లోతైన భావోద్వేగాలు, మానసిక కారణాలు దాగి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సంబంధాల్లో ఇలా జరగడానికి కొన్ని ముఖ్యమైన జీవిత అనుభవాలు, మనస్తత్వ లక్షణాలే ప్రధానంగా ప్రభావితం చేస్తాయని చెబుతారు. ఇప్పుడు మనం నెగెటివ్ రిలేషన్‌ లో చిక్కుకునే ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం.

Toxic Relationships: నెగిటివ్ రిలేషన్‌ షిప్స్‌ కి కారణం ఏంటో మీకు తెలుసా..?
Toxic Relationships
Prashanthi V
|

Updated on: Jun 15, 2025 | 8:15 PM

Share

బాల్యంలో తగిన ప్రేమ ఆదరణ లేకుండా పెరిగిన వారు సంబంధాల గురించి సుదీర్ఘ అనుభవం లేకుండా ఎదుగుతారు. వారి బాల్యంలో ఉన్న అస్థిరతే వారికి సర్వసాధారణంగా అనిపిస్తూ ఎదిగిన తర్వాత కూడా అలాగే గందరగోళమైన సంబంధాల వైపు ఆకర్షితులవుతారు. ఇవి మంచివి కావని తెలిసినా బాల్యంలో అలవాటైన అనుభూతుల కారణంగా అలాంటి సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు.

బాల్యంలో ఎదురైన అనుభవాల ప్రభావంతో ప్రేమ అనేది త్యాగం చేయడం, బాధలు భరించడం ద్వారా పొందే అనుభూతిగా కొందరికి నమ్మకం ఏర్పడుతుంది. దీని వల్ల సంబంధాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ అవే నిజమైన ప్రేమకు సూచనలుగా భావించే ధోరణి పెరిగిపోతుంది.

కొంతమంది ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఎంత బాధకరంగా ఉన్నా.. ఒక రోజు తప్పకుండా మారతారు అనే ఆశను కోల్పోరు. ఈ భావన వల్ల సంబంధం కష్టాల్లో ఉన్నా విడిపోయే బదులు కొనసాగించడానికే ఎక్కువగా మొగ్గుచూపుతారు.

తక్కువ ఆత్మవిశ్వాసం లేదా స్వీయ విలువలపై స్పష్టత లేకపోవడం వల్ల నేను దీనికంటే మంచి జీవితానికి అర్హుడిని కాదు అనే భావన వ్యక్తుల్లో ఏర్పడుతుంది. దీని వల్ల వారు హానికరమైన సంబంధాలను కూడా సహజంగా అనుభవిస్తూ అవి తట్టుకునే ప్రయత్నం చేస్తారు.

చిన్ననాటి గాయాలను మరిచి వాటిపై గెలిచే ప్రయత్నంగా కొంత మంది వ్యక్తులు కొత్త సంబంధాల్లోకి అడుగుపెడతారు. వారు గతంలో ఎదురైన నిర్లక్ష్యం, ప్రేమ లోటును భర్తీ చేసేందుకు ఇదే సందర్భాన్ని మరొకరితో సరిచేయాలన్న ఆశతో ముందుకు సాగుతారు. ఫలితంగా వారు మళ్లీ మళ్లీ ఒకే విధమైన వ్యక్తులను ఎంచుకుని గతానుభవాలనే తిరిగి అనుభవిస్తుంటారు.

ఇలాంటి నష్టాన్ని కలిగించే సంబంధాల్లో చిక్కుకోవడం అనేది కేవలం తప్పు నిర్ణయాల ఫలితమే కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక మన బాల్యం, గత అనుభవాలు, స్వీయ విలువలు, ఆత్మగౌరవం, అలాగే చుట్టూ ఉన్న వాతావరణం వంటి అనేక అంశాలు ఉన్నతంగా ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కలిసే మనం ఎలాంటి సంబంధాలను ఎంచుకుంటామనే విషయంపై ప్రభావం చూపుతాయి.

దీని నుంచి బయటపడటానికి ఏం చేయాలి..?

  • ముందు మనకు మనమే విలువనిచ్చుకోవాలి. మన విలువను మనమే గుర్తించకుండా.. ఇతరుల నుండి గౌరవాన్ని ఆశించడం సరికాదు.
  • ఎవరైనా మన హద్దులను దాటితే ఊరుకోకూడదు.
  • మనం నమ్మే నెగెటివ్ అభిప్రాయాలను వదిలిపెట్టాలి.
  • ప్రేమ అనేది బాధతో వస్తుందనే అపోహ నుంచి బయటపడాలి.

ఈ మార్పులు మనలో భద్రతను పెంచుతాయి. మనం ఎంచుకునే వ్యక్తులను ఆత్మగౌరవంతో, స్పష్టమైన ప్రమాణాలతో చూసే అవకాశాన్ని కలిగిస్తాయి. అప్పుడు మాత్రమే నిజమైన ప్రేమకు, గౌరవానికి ఉన్న సంబంధాలను మనం అనుభవించగలుగుతాం.