Jaggery Effects on Health: చలికాలంలో బెల్లం ఆరోగ్యానికి హానీకరం.. ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకోండి..!

Jaggery Effects on Health: చలికాలంలో బెల్లం తినడం ఒక విభిన్నమైన సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సీజన్‌లో బెల్లం తినాలని చాలా మంది సలహా ఇస్తుంటారు.

Jaggery Effects on Health: చలికాలంలో బెల్లం ఆరోగ్యానికి హానీకరం.. ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకోండి..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 04, 2022 | 1:38 PM

Jaggery Effects on Health: చలికాలంలో బెల్లం తినడం ఒక విభిన్నమైన సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సీజన్‌లో బెల్లం తినాలని చాలా మంది సలహా ఇస్తుంటారు. బెల్లం తినడం వల్ల అనే రోగాలను దూరం చేసుకోవచ్చునని నిపుణులు కూడా సూచిస్తుంటారు. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్‌లో బెల్లం, బెల్లంతో చేసిన పదార్థాలు తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. మరో కీలక విషయం ఏంటంటే.. ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో బెల్లం కూడా అద్భుతంగా పని చేస్తుంది. అయితే, చలికాలంలో బెల్లం తీసుకోవడం వల్ల హానీకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇతర వ్యాధులకు కూడా కారణం అవుతుంది. చలికాలంలో బెల్లం అతిగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అజీర్తి సమస్యలు.. బెల్లం తింటే ఆరోగ్యానికి మంచిది అనేది నిజమే. అయితే, అదే సమయంలో బెల్లం ఎక్కువగా తింటే ఇతర ఉదర సంబంధిత సమస్యలు అనేక ఏర్పడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అజీర్తి సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు.

బరువు పెరగడం.. బెల్లం పంచదార మాదిరిగా హాని చేయదు, కానీ అధిక వినియోగం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. 10 గ్రాముల బెల్లంలో 9.7 గ్రాముల చక్కెర ఉంటుందట. కాబట్టి, ఒక రోజులో పరిమిత పరిమాణంలో మాత్రమే బెల్లం తినాలి. అంతే కాదు బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట.

శరీరంలో మంట.. శరీరంలో మంట సమస్యలు ఉన్నవారు బెల్లం తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు. బెల్లంలో ఉండే సూక్రోజ్ కారణంగా ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయట. నిపుణుల ప్రకారం.. సుక్రోజ్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఒక చోట చేరి వాపునకు కారణమవుతాయట. అందుకే బెల్లం అపరిమితంగా తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

కడుపులో నులి పురుగులు.. చాలా వరకు బెల్లం గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతుంది. బెల్లం తయారు చేసేటప్పుడు ఎంతో కొంత మట్టి పడుతుంది. ఎంత శుభ్రం చేసినా బెల్లంలో మట్టి కలడం సహజం. ఇలాంటి బెల్లం కడుపులోకి వెళ్లడం వల్ల కడుపులో పురుగులు ఏర్పడుతాయి. అందుకే బెల్లంను అధికంగా తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Also read:

RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?

Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!

Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?