Uric Acid: కీళ్ల నొప్పులు పెరుగుతున్నాయా?.. ఈ ఆయుర్వేద మూలికను తీసుకోండి.. నొప్పి వేగంగా తగ్గుతుంది..
యూరిక్ యాసిడ్ నియంత్రించడానికి ప్యూరిన్ లేనటువంటి ఆహారాలను తీసుకోండి.
![Uric Acid: కీళ్ల నొప్పులు పెరుగుతున్నాయా?.. ఈ ఆయుర్వేద మూలికను తీసుకోండి.. నొప్పి వేగంగా తగ్గుతుంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/tippa.jpg?w=1280)
యూరిక్ యాసిడ్ ఏర్పడటం అనేది అసహజమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. ఆహారంలో ప్యూరిన్ ఆహారాలు తీసుకోవడం, అధిక బరువు, మధుమేహ వ్యాధి కారణంగా, మూత్రవిసర్జన మాత్రలు తీసుకోవడం, ఎక్కువ మద్యం సేవించడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను మూత్రపిండం తొలగించలేనప్పుడు యూరిక్ యాసిడ్ పెరగడం అనే సమస్య వస్తుంది.
శరీరంలో టాక్సిన్స్ పెరగడం వల్ల కీళ్లలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. శరీరంలో ఈ విషపదార్థాల పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, అవి స్ఫటికాల రూపంలో శరీరంలోని కీళ్లలో చేరి నొప్పిని కలిగిస్తాయి. యూరిక్ యాసిడ్ పెరుగుదల కారణంగా.. చేతులు, కాళ్ళ కీళ్ళలో నొప్పి మొదలవుతుంది. యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటే, ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
కొన్ని మూలికలు యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. యూరిక్ యాసిడ్‌ను వేగంగా నియంత్రించే అటువంటి ఆయుర్వేద మూలికలలో గుడుచి లేదా తిప్పతీగ ఒకటి. ఈ మూలికను ఉపయోగించడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యూరిక్ యాసిడ్ లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో తిప్పతీగ వినియోగం ఎలా ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకుందాం.
తిప్పతీగ యూరిక్ యాసిడ్‌ని ఎలా నియంత్రిస్తుంది:
తీప్పతీగని గిలోయ్ అని కూడా అంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ హెర్బ్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని రుజువు అయ్యింది. బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడంతో పాటు యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ చేస్తుంది. గుడుచి తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ వేగంగా నియంత్రించబడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న గుడుచి యూరిక్ యాసిడ్ లక్షణాలను తగ్గిస్తుంది. దీనిని ఉపయోగించడం ద్వారా, శరీరంలో వాపు, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుడుచి ఎలా తీసుకోవాలి:
యూరిక్ యాసిడ్ నియంత్రణకు గుడుచి ఆకులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఈ నీళ్లను ఉదయాన్నే సగం వరకు ఉడికించాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి తర్వాత తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటుంది.