Breast Cancer: రొమ్ము క్యాన్సర్ స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా రావచ్చు.. ఈ లక్షణాలుంటే జర భద్రం..

కొన్ని రకాల వ్యాధులు లింగానికి సంబంధించి ఉంటాయి. అంటే కొన్ని వ్యాధులు పురుషులకు మాత్రమే వస్తాయి. మరికొన్ని జబ్బులు మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్..

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా రావచ్చు.. ఈ లక్షణాలుంటే జర భద్రం..
Breast Cancer In Men
Follow us

|

Updated on: Sep 30, 2022 | 11:00 AM

కొన్ని రకాల వ్యాధులు లింగానికి సంబంధించి ఉంటాయి. అంటే కొన్ని వ్యాధులు పురుషులకు మాత్రమే వస్తాయి. మరికొన్ని జబ్బులు మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధుల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ శాతం మహిళలకు వచ్చే వ్యాధి. అయితే పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశాలు లేకపోలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో కేవలం ఒక శాతం మంది పురుషులు మాత్రమే రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి గురవుతున్నారు. అయినా లక్షణాలను ముందే గమనిస్తే రొమ్ము క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబధించిన లక్షణాలు స్త్రీలు, పురుషుల్లో ఒకేలా ఉంటాయంటున్నారు వైద్యులు. పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికి వాటి ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుందంటున్నారు వైద్యులు. స్త్రీల రొమ్ములతో పోలిస్తే పురుషుల రొమ్ములు పూర్తిగా అభివృద్ధి చెందవు. కానీ వీటిలో రొమ్ము కణజాలం ఉంటుంది. అందుకే స్త్రీలతో పాటు మగవారు కూడా బ్రెస్ట క్యాన్సర్ బారిన పడుతుంటారు. దీనికి వైద్య పరిభాషలో డక్టల్ కార్సినోమా అంటారు. పురుషుల పాల నాళాల్లో క్యాన్సర్ ప్రారంభమైతే దానిని లోబ్యులర్ కార్సినోమా అంటారు. చాలా తక్కువ మంది పురుషులు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటారు. అయినప్పటికి ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలను ముందే గుర్తిస్తే వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా ఒక శాతం మంది పురుషులను మాత్రమే ప్రభావితం చేస్తుంది.

వృషణాల వాపు కూడా పురుషుల్లో ఒక్కోసారి రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. వృషణాల శస్త్ర చికిత్స చేయడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ కు కారణం కావచ్చు. సాధారణంగా వృషణాల్లో వాపు రావడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కారణాలు ఏమైనా ఒకసారి వృషణాల్లో వాపు రావడం మొదలైతే మాత్రం ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య చికిత్సలు లేకుండా ఎక్కువ కాలం అలాగే ఉంటే వృషణాలు పెద్దవై, మరికొన్ని ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా అవసరమైన జాగ్రత్తలు తీసుకుని వైద్య చికిత్స పొందాలి. దీనిని నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కు దారితీసే అవకాశం లేకపోలేదు.

బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జన్యుపరమైన వ్యాధి. రక్త సంబంధికులలో ఎవరికైనా రొమ్ము క్యాన్స్ ర్ ఉంటే తప్పకుండా రక్త సంబంధికులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ అని పిలిచే జన్యుపరమైన పరిస్థితి వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి ఉన్న పురుషులు తరచుగా అధిక మొత్తంలో ఫిమేల్ హార్మోన్లను ఉత్పత్తి చేయడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు సూచిస్తున్నారు. పురుషుల్లో, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం. రొమ్ములో గడ్డ ఏర్పడుతుంది. చేతితో తాకినప్పుడు గట్టిగా ఉండటం, రాయిలా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేసినట్లయితే అది క్యాన్సర్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రొమ్ము పరిమాణంలో పెరుగుదల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణం కావచ్చు. పురుషుల్లో రొమ్ము పరిమాణం పెరుగుదల చాలా తక్కువుగా ఉంటుంది. ఏదైనా సందర్భంలో పురుషుల రొమ్ము సైజు పెరుగుతున్నట్లు అనిపిస్తే తక్షణమే సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించాలి. లేదంటే రొమ్ము పరిమాణం పెరుగుదల కూడా క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది.

గొంతు ఉరుగుజ్జులు, చనుమొనలపై పొక్కులు, విలోమ చనుమొనలు మొదలైవని కూడా రొమ్ము క్యాన్సర్ కు కారణం కావచ్చు. పురుషులు లేదా స్త్రీలల్లో ఎవరిలో అయినా ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య నిపుణులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Latest Articles