ఎక్కువగా ఫోన్ వాడితే బ్రెయిన్ ఖరాబ్ అవుతుందా..? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారు..?
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, ఫాస్ట్ ఇంటర్నెట్ మన జీవితంలో భాగమైపోయాయి. అయితే టెక్నాలజీ వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా అవుతుందా..? ముఖ్యంగా ఫోన్ వాడకం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయా..? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ అనుమానాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

5జీ, 6జీ లాంటి కొత్త టెక్నాలజీలు వేగంగా వస్తున్నాయి. ఈ మార్పుల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యల భయాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. ఇవి క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలకు కారణమవుతాయా..? అనే ప్రశ్నలు చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు శాస్త్రీయంగా వీటికి ఎలాంటి ఆధారాలు లేవు.
సాధారణంగా మొబైల్ ఫోన్లు non ionizing radiationని విడుదల చేస్తాయి. వీటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. gamma rays, X rays లాంటి ప్రమాదకరమైన కిరణాల్లా ఇవి ప్రభావాన్ని చూపించవు. డీఎన్ ఏను నాశనం చేయగల శక్తి వీటిలో ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
చాలా మంది ఎక్కువ కాలం మొబైల్ వాడితే మెదడు సంబంధిత రోగాలు వస్తాయని అనుకుంటున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారని.. దీని వల్ల వాళ్ల ఆరోగ్యానికి ఏమైనా అవుతుందేమోనని కంగారు పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు దీన్ని నిరూపించే నమ్మదగిన ఆధారాలు లేవు.
నరాల శస్త్రచికిత్స నిపుణులు ఈ విషయంపై మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు తక్కువ శక్తితో పనిచేసే రేడియో ట్రాన్స్‌మిటర్ల లాంటివి. బలమైన సిగ్నల్ ఉన్న చోట్ల ఇవి మామూలు ల్యాండ్ లైన్ లా పనిచేస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వీటిని తయారు చేస్తారు కాబట్టి వాడేవాళ్లకు ప్రమాదం ఉండదు అన్నారు.
మొబైల్ వాడకంపై ఇంకా అనుమానాలు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- హెడ్ ఫోన్ లేదా హ్యాండ్స్ ఫ్రీ వాడండి.
- ఎక్కువసేపు ఫోన్ మాట్లాడకుండా కాల్ సమయాన్ని తగ్గించండి.
- ఫోన్ ను శరీరానికి దగ్గరగా పెట్టకుండా దూరంగా ఉంచండి.
- అవసరమైతే టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్ వాడండి.
5జీ టవర్ల వల్ల క్యాన్సర్ వస్తుందనే అపోహలు ఉన్నా.. ఇది నిజం కాదని పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. 5జీ వేవ్ లు కూడా తక్కువ శక్తి గల non ionizing radiationను విడుదల చేస్తాయి. ఇవి gamma rays, X rays కావు కాబట్టి మన శరీరంలోని కణాలను నాశనం చేసే శక్తి వీటిలో ఉండదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ (IARC) 2011లో మొబైల్ ఫోన్ లు విడుదల చేసే రేడియేషన్ ను గ్రూప్ 2B కేటగిరీలోకి వర్గీకరించింది. అంటే ఇది క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉన్నదిగా భావించవచ్చు అని అర్థం. కానీ ఇది తక్కువ ఆధారాలపై మాత్రమే చేసిన అంచనా అని ఆ సంస్థనే స్పష్టంగా చెప్పింది.
ఇతర పరిశోధనల ప్రకారం మొబైల్ రేడియేషన్ కి క్యాన్సర్ మధ్య స్పష్టమైన సంబంధం లేదని తేలింది. ఈ విషయంలో పూర్తి స్పష్టత రావాలంటే ఇంకా మెరుగైన, లోతైన అధ్యయనాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ లు మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. అయితే వాటిని జాగ్రత్తగా వాడటం ద్వారా ఆరోగ్య ప్రమాదాలను నివారించవచ్చు. శాస్త్రీయంగా నిరూపించని భయాల వల్ల కంగారు పడకండి. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదమూ ఉండదు.