AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: షుగర్‌ పేషెంట్స్‌ డార్క్‌ చాక్లెట్స్‌ తినొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..

అయితే షుగర్‌ పేషెంట్స్‌ డార్క్‌ చాక్లెట్స్‌ తింటే ఎలాంటి నష్టం జరగదని కొందరు భావిస్తుంటారు. సాధారణంగా డార్క్‌ చాక్లెట్స్‌ తయారీలో కోకో అనే పదార్థాన్ని వాడుతారనే విషయం తెలిసిందే. కోకోలోని చేదును తగ్గించేందుకు చాక్లెట్స్‌లో చక్కెరను కలుపుతారు. దీంతో డార్క్‌ చాక్లెట్స్‌లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి డార్క్‌ చాక్లెట్స్‌ను అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది...

Health: షుగర్‌ పేషెంట్స్‌ డార్క్‌ చాక్లెట్స్‌ తినొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..
Dark Chocolate
Narender Vaitla
|

Updated on: Dec 17, 2023 | 9:43 PM

Share

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. మరీ ముఖ్యంగా భారత్‌లో డయాబెటిక్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. షుగర్‌ వచ్చిందంటే చాలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారం విషయంలో ఎన్నో కండిషన్స్‌ పెడుతుంటారు. ముఖ్యంగా చక్కెర సంబంధిత ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు.

అయితే షుగర్‌ పేషెంట్స్‌ డార్క్‌ చాక్లెట్స్‌ తింటే ఎలాంటి నష్టం జరగదని కొందరు భావిస్తుంటారు. సాధారణంగా డార్క్‌ చాక్లెట్స్‌ తయారీలో కోకో అనే పదార్థాన్ని వాడుతారనే విషయం తెలిసిందే. కోకోలోని చేదును తగ్గించేందుకు చాక్లెట్స్‌లో చక్కెరను కలుపుతారు. దీంతో డార్క్‌ చాక్లెట్స్‌లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి డార్క్‌ చాక్లెట్స్‌ను అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

డార్క్‌ చాక్లెట్స్‌లో చక్కెర తక్కువగా ఉంటుందన్న కారణంతో కొందరు డయాబెటిస్‌ ఉన్న వారు వీటిని తీసుకున్నా నష్టం జరగదనే భావనలో ఉంటారు. డార్క్‌ చాక్లెట్స్‌లో 70 శాతం కోకో ఉంటుంది. అలాగే చక్కెరను కూడా కలుపుతారు. అంతేకాకుండా డార్క్‌ చాక్లెట్స్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుందని పరిశోధనలో తేలింది. శరీరం తన ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. కానీ అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడవు కాబట్టి షుగర్‌ పేషెంట్స్‌ డార్క్‌ చాక్లెట్స్‌ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇక ప్రాసెస్ చేసిన డార్క్‌ చాక్లెట్స్‌ ఆరోగ్యానికి ప్రమాకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే డార్క్‌ చాక్లెట్‌ను పరిమితి మించకుండా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడి వంటి మానసిక సమస్యలకు డార్క్‌ చాక్లెట్‌తో చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు 5.7 శాతం కంటే తక్కువగా ఉన్న వారు ఎలాంటి భయం లేకుండా డార్క్‌ చాక్లెట్స్‌ తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే షుగర్‌ ఎక్కువగా ఉన్న వారు మాత్రం కచ్చితంగా డార్క్‌ చాక్లెట్స్‌ తీసుకోకూడదని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..