Indians Hight: ఎత్తు తగ్గుతున్న భారతీయులు.. ఎత్తు ఎందుకు తగ్గుతున్నారు? సగటు ఎత్తు తక్కువగా ఉందంటే అర్ధం ఏమిటి?

ఎత్తు గురించి చేసిన అధ్యయనంలో భారతీయుల సగటు ఎత్తు తగ్గుతోందని వెల్లడైంది. భారతీయుల సగటు ఎత్తు 2005-06 నుండి 2015-16 వరకు తగ్గింది. భారతదేశానికి భిన్నంగా, ఇతర దేశాలలో ప్రజలు ఎత్తు పెరుగుతుండటం విశేషం. 

Indians Hight: ఎత్తు తగ్గుతున్న భారతీయులు.. ఎత్తు ఎందుకు తగ్గుతున్నారు? సగటు ఎత్తు తక్కువగా ఉందంటే అర్ధం ఏమిటి?
Indians Height
Follow us

|

Updated on: Oct 03, 2021 | 3:49 PM

Indians Hight: ఎత్తు గురించి చేసిన అధ్యయనంలో భారతీయుల సగటు ఎత్తు తగ్గుతోందని వెల్లడైంది. భారతీయుల సగటు ఎత్తు 2005-06 నుండి 2015-16 వరకు తగ్గింది. భారతదేశానికి భిన్నంగా, ఇతర దేశాలలో ప్రజలు ఎత్తు పెరుగుతుండటం విశేషం. సెంటర్ ఆఫ్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ప్రకారం, దేశంలో వయోజన మహిళలు.. పురుషుల సగటు ఎత్తు తగ్గింది. గిరిజన మహిళలతో పాటు, పేద వర్గాల నుండి మహిళల ఎత్తు కూడా గణనీయంగా తగ్గింది.

ఈ అధ్యయనంలో, రాష్ట్రం, కులం, ఆదాయం, వయస్సు ఆధారంగా పురుషులు,మహిళల ఎత్తుకు సంబంధించి డేటా విడుదల చేశారు.

ఈ అధ్యయన ఫలితాలు ఏమి చెబుతున్నాయి? వివిధ రాష్ట్రాల్లో పురుషులు,మహిళల ఎత్తులో మార్పులు ఏమిటి? మతం ఆధారంగా ఉన్న ఎత్తు గణాంకాలు ఏమి చెబుతున్నాయి? ఏ కుల మహిళల ఎత్తు ఎక్కువగా తగ్గింది? అసలు ఈ గణాంకాలు మనకు ఎందుకు ? ఈ విషయాలు తెలుసుకుందాం. 

అధ్యయన ఫలితాలు ఏమి చెబుతున్నాయి?

  • 15-50 సంవత్సరాల వయస్సు గల పురుషుల సగటు ఎత్తులో తగ్గుదల ఉంది. 2005-06 అలాగే, 2015-16 మధ్య, 15 – 25 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయుల సగటు ఎత్తు 1.10 సెం.మీ తగ్గింది. అదే సమయంలో, 26 నుండి 50 సంవత్సరాల పురుషుల సగటు ఎత్తు కూడా 0.86 సెం.మీ తగ్గింది.
  • 15-25 సంవత్సరాల భారతీయ మహిళల సగటు ఎత్తు కూడా తగ్గింది. ఈ వయస్సులో మహిళల సగటు ఎత్తు 2005-06 అదేవిధంగా  2015-16 మధ్య కాలంలో 0.12 సెం.మీ. తగ్గింది. 
  • 26-50 సంవత్సరాల వయస్సు గల మహిళల సగటు ఎత్తులో పెరుగుదల ఉంది. ఈ వయస్సు గల మహిళల సగటు ఎత్తు 0.13 సెం.మీ పెరిగింది.

రాష్ట్ర గణాంకాలు ఏమి చెబుతున్నాయి?

సర్వేలో, మహిళలు మరియు పురుషుల ఎత్తు కూడా వివిధ రాష్ట్రాల ఆధారంగా అధ్యయనం చేశారు. 2005-06 అదేవిధంగా ,  2015-16 సమయంలో హర్యానా పురుషుల ఎత్తులో అత్యధిక క్షీణత నమోదైందని, మేఘాలయ పురుషుల ఎత్తు ఎక్కువగా పెరిగిందని డేటా చూపిస్తుంది. అదేవిధంగా, సిక్కిం మహిళల ఎత్తు ఎక్కువగా పెరిగింది, హర్యానా మహిళల ఎత్తు చాలా వరకు తగ్గింది.

26-50 ఏజ్ గ్రూపులో, కర్ణాటక నుండి వచ్చిన పురుషులకు ఎత్తులో గరిష్ట క్షీణత నమోదైంది. కర్ణాటకలో పురుషుల ఎత్తు 2.04 సెం.మీ. హర్యానా తర్వాత జార్ఖండ్ రెండవ స్థానంలో ఉంది. జార్ఖండ్ పురుషుల ఎత్తు 2 సెంటీమీటర్లు తగ్గింది.

పార్సీ మతంలోని పురుషుల ఎత్తులో అతిపెద్ద తగ్గింపు

2005-06 అలాగే,  2015-16 మధ్య, జొరాస్ట్రియనిజం పురుషుల ఎత్తులో అతిపెద్ద క్షీణత ఉందని మతం ఆధారంగా ఎత్తు గణాంకాలు చూపుతున్నాయి. రెండవ స్థానంలో జైనమత పురుషులు ఉన్నారు. అదేవిధంగా, బౌద్ధమతం, జైనమతంలోని మహిళలు తప్ప, అన్ని ఇతర మతాల మహిళల ఎత్తు కూడా తగ్గింది.

అన్ని కులాల పురుషుల ఎత్తు తగ్గింది, ఎస్సీ మహిళల ఎత్తు పెరిగింది

అధ్యయనంలో కులం ఆధారంగా ఎత్తు గణాంకాలు అన్ని కులాల పురుషుల ఎత్తులో క్షీణత ఉన్నట్లు చూపుతున్నాయి. అదే సమయంలో, ఎస్సీ కేటగిరీ మహిళల ఎత్తు పెరిగింది. 26-50 సంవత్సరాల మహిళలలో, ఎస్టీ కేటగిరీ మహిళలు మాత్రమే ఇతర అన్ని వర్గాల మహిళల ఎత్తులో క్షీణతను నమోదు చేశారు. 26-50 సంవత్సరాల ఎస్సీ కేటగిరీ మహిళల్లో అత్యధిక పెరుగుదల నమోదైంది.

ప్రతి ఆర్థిక తరగతి పురుషుల ఎత్తు తగ్గింది, కానీ మహిళల ఎత్తు పెరిగింది

ప్రతి ఆర్థిక తరగతి పురుషుల ఎత్తులో క్షీణత ఉంది. అదే సమయంలో, అత్యంత పేద మహిళలు మినహా, అన్ని ఆర్థిక తరగతుల మహిళల ఎత్తులో పెరుగుదల ఉంది.

ఈ గణాంకాలు ఎందుకు ఆందోళనకరంగా ఉన్నాయి?

  • ఈ సర్వేలో పాలుపంచుకున్న నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఒక వ్యక్తి ఎత్తు అతని మొత్తం జీవన నాణ్యతను సూచిస్తుంది. అంటే, ఒక వ్యక్తి ఎత్తు సాధారణంగా ఉంటే, తల్లి గర్భం నుండి 20-22 సంవత్సరాల వయస్సు వరకు అతనికి మంచి పోషకాహారం లభించిందని, అనారోగ్యంతో ఉన్నప్పుడు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు లభించాయని అలాగే, మెరుగైన పరిశుభ్రత వాతావరణంలో పెరిగాయని అర్థం. పారిశుధ్యం .. అంటే, ఒకరి ఎత్తు తక్కువగా ఉంటే, దాని కారణం కూడా జీవన ప్రమాణానికి సంబంధించినది కావచ్చు.
  • ఎత్తు పోషకాహారం, ఆదాయం, కులం, ప్రాంతం, ఆరోగ్యం, అనేక ఇతర అంశాలకు సంబంధించినది. పేదరికం కారణంగా, ప్రజలు తక్కువ పోషకాహారాన్ని పొందుతారు. అది వారి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అంటే, ఒక వ్యక్తి ఎత్తు అతని శారీరక ఆరోగ్యం, జీవన ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది. భారతీయుల ఎత్తు తగ్గుతుంటే, పోషకాహారం..ఆరోగ్య సంబంధిత పథకాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అర్థం.
  • ఎత్తు కూడా ఉత్పాదకతతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ఏ కారణం చేతనైనా చిన్నతనంలో పిల్లల ఎత్తులో 1% తగ్గుదల ఆర్థిక ఉత్పాదకతలో 1.4% నష్టానికి దారితీస్తుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

ఈ అధ్యయనం ఎలా జరిగింది?

జేఎన్ యూలోని సోషల్ మెడిసిన్ మరియు కమ్యూనిటీ హెల్త్‌కి సంబంధించిన ప్రొఫెసర్‌లు, పండితులు ఈ అధ్యయనం చేశారు.  ఈ అధ్యయనం 1998 నుండి 2015 వరకు నిర్వహించిన మూడు జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వేల (NFHS) డేటాను విశ్లేషించింది. ఈ అధ్యయనంలో, 15-25, 26-50 సంవత్సరాల వయస్సు గల పురుషులు.. మహిళల డేటా వేర్వేరు ప్రమాణాలపై అధ్యయనం చేయబడింది. ఇది కాకుండా, నేషనల్ న్యూట్రిషనల్ మానిటరింగ్ బ్యూరో (NNBM)  డేటా కూడా అధ్యయనం చేశారు.

Also Read: Mumbai Drug Bust: నడిసంద్రంలో రేవ్ పార్టీ.. కోట్లాది రూపాయల ఖర్చు.. పట్టుబడ్డ వారిలో షారూఖ్ ఖాన్ తనయుడు!

Hyderabad: ఈ సండే హైదరాబాదీలకు జాలీడే.. ట్యాంక్‌బండ్‌పై నేటి ప్రత్యేకతలు ఇవే.. వాహనదారులు అలర్ట్‌.