How To Lose Belly Fat: పొట్ట కొవ్వు .. అధిక బరువు తగ్గాలంటే ఏమి చేయాలో తెలుసా..

Health Tips: ఆడ, మగ, చిన్న పెద్ద, యువకుడు ముసలి అనే తేడాలేకుండా భారీ పొట్టతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా పొట్టలో కొవ్వు పేరుకుపోయి అనేక వ్యాధులకు..

How To Lose Belly Fat:  పొట్ట కొవ్వు .. అధిక బరువు తగ్గాలంటే ఏమి చేయాలో తెలుసా..
Belly Fat
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Jun 28, 2021 | 7:33 PM

Health Tips: ఆడ, మగ, చిన్న పెద్ద, యువకుడు ముసలి అనే తేడాలేకుండా భారీ పొట్టతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా పొట్టలో కొవ్వు పేరుకుపోయి అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఇలా పొట్టదగ్గర కొవ్వు పేరుకోవడానికి కారణం.. శారీరక శ్రమ లేకపోవడం ఒకటైతే.. మనం తినే ఆహారం మరొకటి. ముఖ్యంగా ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, బేక‌రీ ఐట‌మ్స్‌ను ఎక్కువగా తినడంతోనే పొట్ట పెరుగుతుంది. బ‌రువు కూడా పెరుగుతుంది. అయితే పొట్ట ఉంది.. బరువు ఉందని ఒత్తిడికి లోనుకావద్దు. ఒత్తిడికి లోనైతే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఫ‌లితంగా అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక పొట్ట ఎక్కువగా ఉన్నారు.. బరువు అధికంగా ఉన్నవారు ఒత్తిడిని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

రోజూ విశ్రాంతి తీసుకునే సమయం కూడా ముఖ్యమే.. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా అధికంగా బ‌రువు పెరుగుతారు. క‌నుక రోజూ క‌నీసం 8 గంట‌ల పాటు అయినా నిద్ర‌పోవాలి. దీంతో శ‌రీర జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. ఫ‌లితంగా బ‌రువు అదుపులో ఉంటుంది.

రోజూ కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. నిత్యం చేసే వ్యాయామంలో కొంత స‌మ‌యం అయినా చాలా క‌ఠినంగా ఉండే వ్యాయామాల‌ను చేస్తే అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చునని .. ముఖ్యంగా మెట్లు ఎక్కడం దిగడం బరువును తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: కర్ణాటక మినిష్టర్ పై ఒక రూపాయికి పరువు నష్టం దావా వేసిన కన్నడ హీరో చేతన్..

పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాను రెండు చేతులతో పట్టుకుని.. కాళ్ల కింద వేసి తొక్కుతూ..

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి