Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannada Actor Chetan Kumar: కర్ణాటక మినిష్టర్ పై ఒక రూపాయికి పరువు నష్టం దావా వేసిన కన్నడ హీరో చేతన్..

Kannada Actor Chetan Kumar: కర్ణాటకలో కన్నడ హీరో వర్సెస్ కార్మిక శాఖ మంత్రి శివరాం హెబ్బర్ గా అన్నట్లు మారింది పరిస్థితి. కన్నడ హీరో చేతన్ కుమార్ బ్రాహ్మణిజంపై వివాదంలో..

Kannada Actor Chetan Kumar: కర్ణాటక మినిష్టర్ పై ఒక రూపాయికి పరువు నష్టం దావా వేసిన కన్నడ హీరో చేతన్..
Chetan
Follow us
Surya Kala

|

Updated on: Jun 26, 2021 | 7:06 PM

Kannada Actor Chetan Kumar: కర్ణాటకలో కన్నడ హీరో వర్సెస్ కార్మిక శాఖ మంత్రి శివరాం హెబ్బర్ గా అన్నట్లు మారింది పరిస్థితి. కన్నడ హీరో చేతన్ కుమార్ బ్రాహ్మణిజంపై వివాదంలో చిక్కుకున్నారు. చేతన్ బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. అందుకని హీరో చేతన్ ను అరెస్ట్ చేయాలంటూ కార్మిక శాఖ మంత్రి శివరాం డిమాండ్ చేశారు. దీంతో మంత్రి శివరాం పై హీరో చేతన్ ఒక్క రూపాయి కోరుతూ పరువు నష్టం దావా వేశారు. ఆంతే కాదు మంత్రి శివరాం తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని చేతన్ డిమాండ్ చేశారు.

‘‘చేతన్ అహింస’’గా సుపరిచితుడైన చేతన్ రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో లో బ్రాహ్మణులు… అంబేద్కర్, పెరియార్ ఆలోచనలను అణిచి వేసి బ్రాహ్మణవాదాన్ని అమలు చేసారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రాహ్మణిజం పై చేతన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలో హీరో చేతన్ పై ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే బ్రాహ్మణిజంపై చేసిన వ్యాఖ్యలకుగాను కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ కుమార్‌ను ఇప్పటికే బెంగళూరు పోలీసులు విచారించారు. మరోవైపు భారత సంతతి వ్యక్తిగా ఉంటూ ఇక్కడి నిబంధలను ఉల్లంఘించినందుకు ఆయన్ను అమెరికాకు తిరిగి పంపించేయాలని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ)లోనూ ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మొదట్లో కూడా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Also Read: నవ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా ప్రదక్షణ చేయాలి.. ఎన్ని ప్రదక్షణలు చేస్తే ఫలితం దక్కుతుందంటే