గట్ హెల్త్.. మన ఆరోగ్యం దీనిపైనే డిపెండ్ అవుతుంది..! నిర్లక్ష్యం చేశారో అంతే సంగతి..!
మన ఆరోగ్యం బాగుండాలంటే గట్ హెల్త్ చాలా కీలకం. ఇది కేవలం జీర్ణవ్యవస్థ మాత్రమే కాకుండా.. ఇమ్యూనిటీ, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కూడా ప్రభావితం చేస్తుంది. సరైన ఆహారం ద్వారా మంచి బ్యాక్టీరియాను పెంచితే గట్ హెల్త్ మెరుగుపడుతుంది. గట్ హెల్త్ కోసం తినాల్సిన ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

మనం తీసుకునే ఫుడ్ మన హెల్త్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా గట్ హెల్త్ బాగుంటేనే మిగతా ఆరోగ్య విషయాలు బాగుంటాయి. గట్ హెల్త్ అంటే కేవలం పేగుల ఆరోగ్యం మాత్రమే కాదు. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్, ఇమ్యూనిటీ పవర్, మలబద్ధకం, గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడాన్ని సూచిస్తుంది.
గట్ హెల్త్ ఎందుకు ముఖ్యం..?
ప్రతి ఒక్కరిలో జీర్ణవ్యవస్థ ఒకేలా ఉండదు. కొందరికి కొన్ని ఫుడ్స్ పడతాయి. మరికొందరికి అవే ఫుడ్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అందుకే ఒకరి జీర్ణవ్యవస్థను మరొకరితో పోల్చడం కరెక్ట్ కాదు. మనం తీసుకునే ఫుడ్‌లో ఉండే న్యూట్రియెంట్స్ మన పేగులో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. ఒకవేళ రాంగ్ ఫుడ్స్ తీసుకుంటే మంచి బ్యాక్టీరియా సంఖ్య తగ్గి గట్ సంబంధిత ప్రాబ్లమ్స్ మొదలవుతాయి.
గట్ హెల్త్ బాలేదని తెలిపే సైన్స్
మీకు చిన్న పనులకే అలసట, నీరసం, చిరాకుగా ఉండటం, తక్కువగా తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం లాంటివి ఉంటే.. అది మీ గట్ హెల్త్ సరిగా లేదని సూచించవచ్చు. మీ ఫిజికల్ హెల్త్ మీ గట్ హెల్త్ పైనే డిపెండ్ అవుతుంది. అందుకే హెల్త్‌ను కాపాడుకోవాలంటే గట్ హెల్త్‌కు బెనిఫిట్ చేసే ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. గట్ హెల్త్‌ను మెరుగుపరచే ముఖ్యమైన ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ ఫుడ్స్
డైజెషన్ ఈజీగా జరగాలంటే ఫైబర్ చాలా అవసరం. ఇది కడుపు నిండిన ఫీలింగ్ ను ఇవ్వడమే కాకుండా.. ఉబ్బసం, మలబద్ధకం, గుండెల్లో మంట లాంటి సమస్యలను తగ్గిస్తుంది. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు.. ఇవన్నీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్.
పులియబెట్టిన ఫుడ్స్
ఫెర్మెంట్ చేసిన ఫుడ్స్‌లో సహజంగా తయారయ్యే ప్రోబయాటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది బాడీలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. పెరుగు, మజ్జిగ, ఇడ్లీ పిండి, దోశ పిండి లాంటి ఫుడ్స్ మంచి బ్యాక్టీరియా పెరగడానికి సాయపడతాయి. ఇవి గట్ హెల్త్‌ను బాగా మెరుగుపరుస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




