AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Sauce Pasta: ఇంట్లోనే వైట్ సాస్ పాస్తా.. ఎలా తయారు చేసుకోవాలంటే..!

White Sauce Pasta: వైట్ సాస్ పాస్తా ఒక ప్రసిద్ధ ఇటాలియన్ వంటకం. ఈ రుచికరమైన వంటకాన్ని బేబీ కార్న్, పుట్టగొడుగులు, ఫ్రెష్ క్రీమ్‌తో...

White Sauce Pasta: ఇంట్లోనే వైట్ సాస్ పాస్తా.. ఎలా తయారు చేసుకోవాలంటే..!
White Pasta
Shiva Prajapati
|

Updated on: Jun 29, 2021 | 11:06 PM

Share

White Sauce Pasta: వైట్ సాస్ పాస్తా ఒక ప్రసిద్ధ ఇటాలియన్ వంటకం. ఈ రుచికరమైన వంటకాన్ని బేబీ కార్న్, పుట్టగొడుగులు, ఫ్రెష్ క్రీమ్‌తో తయారు చేస్తారు. పిల్లలు ఈ వంటకాన్ని చాలా ఇష్టపడతారు. ఈ రుచికరమైన వంటకాన్ని ప్రత్యేక సందర్భాలలో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాస్తాను మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మిరప తరుము, క్యాప్సికమ్ ముక్కలు ఇలా రకరకాల ఆరోగ్యకరమైన పదార్థాలతో చేసుకోవచ్చు. ఈ రెసిపీని చపాతీలో రోల్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

ఇంట్లో వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలంటే.. గ్లూటెన్ పాస్తా 1 కప్పు పొద్దుతిరుగుడు నూనె 1/2 స్పూన్ వెన్న 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ 1 తరిగిన మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు అవసరమైన ఉప్పు 1/2 స్పూన్ మిరప రేకులు మేక చీజ్ – 100 గ్రాములు క్యారెట్ 1 చిన్న తరిగిన క్యాబేజీ 1 చిన్న తరిగిన నీరు 2 1/2 కప్పులు బేబీ కార్న్ 1 కప్పు సెలెరీ 1 స్పూన్ క్యాప్సికమ్ (పచ్చిమిర్చి) 1 మీడియం తరిగిన పాలు 2 1/2 కప్పులు నల్ల మిరియాలు 1/2 స్పూన్ తాజా క్రీమ్ 1/4 టేబుల్ స్పూన్ పుట్టగొడుగు 1 ముక్క టొమాటో 1 చిన్న తరిగిన

1. పాస్తాను నీటిలో కాసేపు ఉడికించాలి వైట్ సాస్ పాస్తా తయారు చేయడానికి, ఒక పాత్రలో సరిపడినంత నీటిలో కొంచెం నూనె, 1 స్పూన్ ఉప్పు వేయాలి. అధిక మంట మీద ఒక నిమిషం పాటు వేడి చేయాలి. కాసేపటి తరువాత దీంట్లో పాస్తా వేసి మరో 10 నిమిషాలు మీడియం మంటపై వేడి చేయాలి. పాస్తా ఉడికిందా లేదా చెక్ చసుకుని నీటిని తీసివేయాలి.

2. మనకు నచ్చిన కాయగూరలను కట్ చేసుకుని 2 నిమిషాలు వేయించాలి.. ఒక గిన్నెలో నెయ్యి వేసి మీడయం మంట మీద వేడి చేయాలి. ఆ తరువాత ఆ గిన్నెలో సరిపడినన్ని ఉల్లిపాయలు వేసి లేత గులాబీ రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తరువాత పుట్టగొడుగులు, బేబీ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి.

3. సుగంధ ద్రవ్యాలతో పాటు క్రీమ్, కార్న్‌ఫ్లోర్ యాడ్ చేయండి.. గిన్నెలో ఉడికించిన కూరగాయలకు కార్న్‌ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు, నల్ల మిరియాలు, ఎర్ర కారం, పాలు వేసి మరో 5-6 నిమిషాలు ఉడకబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి క్రీమ్, ఉడికించిన పాస్తా వేసి మరో 2 నిమిషాలు వేడి చేయాలి.

4. జున్నుతో గార్నిష్.. జున్నుతో అలంకరించి 5 నిమిషాల పాటు గ్రిల్ చేయండి. హాట్ వైట్ సాస్ పాస్తా రెడీ. లుకింగ్ కోసం పచ్చి మిర్చి తరుము, ఇతర నచ్చిన పదార్థాలతో అలకరించుకుని తినేయడమే.

Also read:

Treasure Hunt: భూమిలో దాచిన వేలాది డాలర్లు.. ఎవరు కనిబెడితే వారికే సోంతమట.. ఎక్కడో తెలుసా..

Immunity Booster: మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ ఆహార పదార్థాలు తీసుకోండి..

Bank Deposits: ఓ కుబుంబం ఖాతాలోకి పొర‌పాటున 50 బిలియ‌న్ డాలర్లను బదిలీ చేసిన బ్యాంకు.. తర్వాత ఏం జరిగిందంటే..?