Health Tips: మీ పాదాలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా.. విస్మరిస్తే తీవ్ర ప్రమాదం.. అవేంటంటే?

High Cholesterol: WHO ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో మూడింట ఒక వంతు మందికి అధిక కొలెస్ట్రాల్ కారణంగా కొరోనరీ ఆర్టరీ వ్యాధి అటాక్ అవుతోంది. కాబట్టి కొలెస్ట్రాల్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.

Health Tips: మీ పాదాలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా.. విస్మరిస్తే తీవ్ర ప్రమాదం.. అవేంటంటే?
High Cholesterol
Follow us
Venkata Chari

|

Updated on: May 13, 2022 | 7:42 AM

High Cholesterol: ప్రస్తుతం అధిక కొలెస్ట్రాల్ చాలా సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయి గుండె జబ్బులు, స్ట్రోక్(heart attack) ప్రమాదాన్ని పెంచుతుంది. 2018 నివేదిక ప్రకారం, భారతదేశంలో హృదయ సంబంధ వ్యాధులతో మరణించే వారి రేటు 34 శాతం పెరిగింది. దీంతో మరణాల రేటు 155.7 నుంచి 209.19 శాతానికి పెరిగిందని తెలుస్తోంది. మరణించిన వారిలో, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, మంచి ఆహారంతో పాటు, కొలెస్ట్రాల్‌ను ఎల్లవేలలా చెక్ చేసుకుంటూ ఉండాలి. తద్వారా కొలెస్ట్రాల్ సకాలంలో నియంత్రించుకోవచ్చు. దీంతో ఆరోగ్య ప్రమాదాలను కూడా త్వరగా తగ్గించుకోవచ్చు. అయితే, పాదాలలో కనిపించే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను కూడా తాజాగా నిపుణులు వెల్లడించారు. ఈ లక్షణాలను మాత్రం అస్సలు విస్మరించకూడదని అంటున్నారు. మీలో కూడా ఈ లక్షణాలను గమనిస్తే, వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

కొలెస్ట్రాల్ కాలేయంలో తయారయ్యే మైనపు పదార్థం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ అంటే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL), తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ (LDL). LDL కొలెస్ట్రాల్ శరీరానికి ప్రమాదకరం. దీని పెరుగుదల వల్ల శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. అధిక కొలెస్ట్రాల్ పరిస్థితిని చూసిన తర్వాత డాక్టర్ చికిత్స చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన వ్యక్తికి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలంటే:

మొత్తం కొలెస్ట్రాల్: 200 కంటే తక్కువ – 239 mg/dL

HDL: 60 mg/dL కంటే ఎక్కువ

LDL: 100 mg/dL కంటే తక్కువ

పాదాలలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఎలా ఉంటాయంటే?

ఒలియో లుస్సో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మోనికా వాస్సెర్మాన్ ప్రకారం, పరిస్థితి ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు సాధారణంగా కనిపించవు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిని గుర్తించడానికి రక్త పరీక్ష చేయవలసి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, కొన్ని లక్షణాలు పాదాలలో కనిపించడం ప్రారంభవుతాయని తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ఎవరైనా వారి పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే, వాటిని విస్మరించకూడదు. ఎందుకంటే ఈ లక్షణాలు శరీరంలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్‌ను సూచిస్తాయి. పాదాలు, కాలి వేళ్లు తిమ్మిరి, పసుపు గోర్లు కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతాలుగా నిలుస్తాయి. అంటే ధమనులు, రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగిందని తెలుసుకోవచ్చు.

ఇది కాకుండా, దిగువ పేర్కొన్న లక్షణాలు కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు కావొచ్చు..

ఛాతి నొప్పి

దిగువ శరీరం చల్లగా ఉంటుంది

తరచుగా శ్వాస ఆడకపోవడం

వికారం

అలసినట్లు అనిపించడం

రక్తపోటులో పెరుగుదల

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అధిక కొలెస్ట్రాల్‌కు గురయ్యే వ్యక్తులు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, వండిన ఆహారం, వేయించిన ఆహారం తీసుకోకుండా ఉండాలి. కాగా, ఆయిల్ ఫిష్ (మాకేరెల్, సాల్మన్), బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ పాస్తా, నట్స్, గింజలు, పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Night Shifts Problems: మీరు నైట్ డ్యూటీలు చేస్తున్నారా?.. అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

Health Tips: ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారా.. పళ్లు పసుపు రంగులోకి మారుతాయి జాగ్రత్త..!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే