Golden Hour: గుండెపోటులో కీలకంగా ‘గోల్డెన్ అవర్’.. అంటే ఏమిటి, అసలేం చేయాలి?
Heart Attack Golden Hour: పోస్ట్ కోవిడ్ ఎఫెక్టో, లేక ఇంకేదైనా కారణమో తెలియదు గాని, నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు. షేన్ వార్న్ విషయంలో అది మరోసారి రుజువైంది.
![Golden Hour: గుండెపోటులో కీలకంగా ‘గోల్డెన్ అవర్’.. అంటే ఏమిటి, అసలేం చేయాలి?](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/03/heart-attack-golden-hour.jpg?w=1280)
గోల్డెన్ అవర్ అనేది ఎమర్జెన్సీ టైమ్(Emergency Time)లో వినిపించే పదం. అవును, ఎవరైనా ఆపదలో ఉంటే ఆ గోల్డెన్ అవరే(Golden Hour) బతికిస్తుందంటారు వైద్యులు. ప్రైమరీ ట్రీట్‌మెంట్ తర్వాత గంటలోపు హాస్పిటల్‌కి తీసుకొస్తే ప్రాణాలు నిలపొచ్చనేది దీని అర్ధం. అయితే, ఇప్పుడు ఈ గోల్డెన్ అవర్ వర్కవుట్ కావడం లేదేమోనన్న అనుమానం వస్తోంది..! ఎందుకంటే, ఆపదలో పడ్డామని గుర్తించేలోపే ప్రాణాలు పోతున్నాయ్. అవును, ఇప్పుడిదే జరుగుతోంది. ఆమధ్య పునీత్ రాజ్‌కుమార్, మొన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఇప్పుడు క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ విషయంలో ఇదే జరిగింది.
పోస్ట్ కోవిడ్ ఎఫెక్టో, లేక ఇంకేదైనా కారణమో తెలియదు గాని, నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు. షేన్ వార్న్ విషయంలో అది మరోసారి రుజువైంది. హార్ట్ ఎటాక్‌కి గురైన షేన్ వార్న్‌ను బతికించుకునేందుకు ముగ్గురు స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించారు. గుండెను రీయాక్టివేట్ చేసేందుకు CPR చేశారు. ఛాతిపై అదుముతూ నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేశారు. 20 నిమిషాలపాటు విశ్వప్రయత్నాలు చేసినా షేన్ వార్న్‌ను బతికించుకోలేకపోయారు అతని స్నేహితులు.
వార్న్ కొద్దిరోజులుగా ముగ్గురు స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్‌లోనే ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ విల్లాలో ఉంటోన్న వార్న్, స్నేహితులు వచ్చేసరికి అచేతనంగా పడి ఉన్నాడు. హార్ట్ ఎటాక్‌గా భావించి వెంటనే CPR చేశారు. కానీ, ప్రాణాలు కాపాడలేకపోయామని అతని స్నేహితులు పేర్కొన్నారు.
Also Read: Heart Attack: ఫిట్‌గా ఉన్నా గుండెపోటు ఎందుకు వస్తోంది.. ముందుగా తెలుసుకునే ఛాన్స్ ఉందా?
Ice Cream: ఐస్‌క్రీము తింటున్నారా.. అయితే జాగ్రత్త.. అందులో ఉండే ఆ లిక్విడ్ ప్రాణాలకే ప్రమాదం..!