Health Tips: పడుకునే ముందు ఈ 4 పదార్థాలకు దూరంగా ఉండండి.. లేదంటే భారీ నష్టం.. అవేంటంటే?

Healthy Sleep: నిద్ర లేకపోవడం ఒక వ్యక్తిని అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురి చేస్తుంది. మీకు కూడా అలాంటి సమస్య ఉంటే ఒకసారి వీటిని చెక్ చేసుకోండి.

Health Tips: పడుకునే ముందు ఈ 4 పదార్థాలకు దూరంగా ఉండండి.. లేదంటే భారీ నష్టం.. అవేంటంటే?
Food
Follow us
Venkata Chari

|

Updated on: Feb 15, 2022 | 8:40 AM

Health Tips: ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం(Health) అతని నిద్రకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. నిద్ర లేకపోవడం ఒక వ్యక్తిని అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురి చేస్తుంది. మీకు కూడా అలాంటి సమస్య ఉంటే, మీ ప్లేట్‌లో వడ్డించిన వస్తువులను ఒకసారి చెక్ చేయాల్సిందే. ఆహారం తీసుకోవడం వల్ల మీకు నిద్ర పట్టదు. నిద్రపోయే ముందు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

కెఫీన్ మీ నిద్ర విధానాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. నిద్రపోయే ముందు టమోటాలు తినడం కూడా నిద్రకు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే టమోటాలు యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పెంచుతాయి. ‘ది సన్’ నివేదిక ప్రకారం, టొమాటోలు మీలో అశాంతిని పెంచేందుకు దోహదపడతాయి. దీంతో మీరు తగినంత, ప్రశాంతమైన నిద్ర పొందగలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

ఇది కాకుండా, ఉల్లిపాయ కూడా మీ జీర్ణవ్యవస్థను గందరగోళానికి గురి చేస్తుంది. ఉల్లి కడుపులో గ్యాస్‌ను తయారు చేయడానికి పని చేస్తుందని ‘ది స్లీపింగ్ అసోసియేషన్’ చెబుతోంది. ఈ వాయువు మీ కడుపు ఒత్తిడిని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా యాసిడ్ గొంతు వైపు కదులుతుంది. ముఖ్యంగా మీరు బోర్లా పడుకున్నప్పుడు ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా, పచ్చి లేదా వండిన ఉల్లిపాయలు రెండూ ఇటువంటి సమస్యలను కలిగిస్తాయని తెలిపింది.

చాక్లెట్, ఉల్లిపాయలు లేదా టమోటాలు వంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆల్కహాల్, కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీరు తిన్న తర్వాత నిద్రించడానికి ప్లాన్ చేస్తున్సినట్లయితే మాత్రం కచ్చితంగా దూరం పెట్టాల్సిందే. మీ నిద్ర విధానాన్ని ప్రభావితం చేసే కెఫిన్ వివిధ రకాల ఆహారాలు, పానీయాలలో ఉందని కూడా గుర్తుంచుకోండి. కెఫీన్ టీ, కాఫీ, వివిధ రకాల డ్రింక్స్‌లో లభిస్తుంది.

7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి ప్రమాదం.. నిద్ర లేకపోవడం మన మెదడు పనితీరుతో పాటు మన శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. రోజుకు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారి బరువు నియంత్రణలో ఉండదు. వారు సాధారణ వ్యక్తుల కంటే త్వరగా ఊబకాయం పొందుతారు. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో లెప్టిన్ స్థాయి తగ్గుతుంది. గ్రెలిన్ (ఆకలి హార్మోన్) స్థాయి పెరుగుతుంది.

Also Read: Riding Bike: బైక్‌పై వెళ్లేటప్పుడు కరోనా రావొద్దంటే ఈ 4 జాగ్రత్తలు తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి..?

Weight Loss Tips: ఎక్కువ సేపు నిద్రపోతే బరువు తగ్గుతారట.. పరిశోధనలో షాకింగ్‌ నిజాలు..