Superfoods: ఆహారంలో చేర్చాల్సిన ముఖ్యమైన 6 సూపర్ ఫుడ్స్… అస్సలు వదలొద్దు!

సూపర్‌ఫుడ్స్‌లో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. మన ఆరోగ్యానికి ఈ సూపర్ ఫుడ్స్ ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

Superfoods: ఆహారంలో చేర్చాల్సిన ముఖ్యమైన 6 సూపర్ ఫుడ్స్... అస్సలు వదలొద్దు!
Superfoods
Follow us

|

Updated on: Jul 30, 2021 | 9:41 AM

Health Tips: సూపర్ ఫుడ్స్‌ని ఆహారంలో చేర్చితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలతో నిండి ఉన్నాయి. అలాగే వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి ఆహారాలను ఎన్నో విధాలుగా కూడా తీసుకోవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

అవిసె గింజలు: ఈ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు (omega 3 fatty acid) ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయపడతాయి. బరువు తగ్గేందుకు ఇది గొప్పగా పనిచేసే సూపర్ ఫుడ్. అలాగే ఇవి కొలెస్ట్రాల్ లేనివి. అందుకే ఇవి మీ గుండెకు చాలా మంచిది. జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. అవిసె గింజలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

కొబ్బరి: కొబ్బరి నూనెను సూపర్ ఫుడ్‌గానే పరిగణిస్తారు. ఇది వంట కోసమే కాదు.. మన అందం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫైబర్ కూడా ఉంటాయి. మీరు దీన్ని అనేక రకాల వంటలలో కూడా ఉపయోగించవచ్చు.

బొప్పాయి: బొప్పాయి చర్మాన్ని పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. దీనిని మాస్క్, క్రీమ్, లోషన్‌గా ఉపయోగించవచ్చు. బొప్పాయిలో విటమిన్ ఏ, సీ, ఇ అధికంగా ఉంటాయి. ఇది గుండె జబ్బులు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది మంచి మూలంకంగా పనిచేస్తోంది.

క్వినోవా: కొల్లాజెన్ ఉత్పత్తికి క్వినోవా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా చేస్తుంది. ఇది ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య లక్షణాలు రాకుండా సహాయపడుతుంది. ఇది చర్మం నుంచి నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలను కూడా తొలగించేందుకు సహాయపడుతుంది.

కలబంద: కొబ్బరిలాగే కలబంద కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను అధిగమించేందుకు సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు, వడదెబ్బలకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. కలబంద జెల్ చర్మం వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. కలబంద రసం తాగడం వల్ల మలబద్దకం, గుండెల్లో మంటను తగ్గిస్తుంది. ఇది కాంతివంతమైన చర్మంతో పాటు చక్కని జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.

ఆలివ్ ఆయిల్: ఈ నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, గుండె, రొమ్ము లేదా జీర్ణ సంబంధ రోగాలను తగ్గిస్తుంది. దీని కోసం వర్జిన్ ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. ఇది ఆహారానికి మంచి రుచిని జోడించడమే కాక, మీ అందాన్ని అందిచేందుకు సహాయపడుతుంది. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. జుట్టు లేదా గోళ్ళపై పూయడం నుంచి లిప్ స్క్రబ్ వరకు దీనిని ఉపయోగించవచ్చు.

Also Read: White Honey Benifits: యాంటీ ఆక్సిడెంట్స్‌లకు కేరాఫ్ అడ్రస్ వైట్ హనీ.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!