Health Tips: ఈ ఫుడ్స్ కలిపి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం.. అనేక వ్యాధులు పరార్..!
Health Tips: ప్రతి ఆహారం మన శరీరానికి గొప్ప ప్రయోజనాలను అందించే దాని స్వంత పోషక విలువలను కలిగి ఉంటుంది. అయితే కొన్ని పదార్థాలను..
Health Tips: ప్రతి ఆహారం మన శరీరానికి గొప్ప ప్రయోజనాలను అందించే దాని స్వంత పోషక విలువలను కలిగి ఉంటుంది. అయితే కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి గరిష్ట పోషకాలు అందేలా మిశ్రమ ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ పదార్థాలను కలిపి తింటే ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కరివేపాకు, పసుపు..
ప్రతీ భారతీయుడి వంటకాల్లో మసాలా దినుసులు, కరివేపాకు, పసుపు తప్పనిసరిగా ఉంటాయి. వీటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని, ఇది మన ఆరోగ్య సంరక్షణలో అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు. వీటిని కలిపి తీసుకుంటే.. ఆరోగ్యంపై డబుల్ ఇంపాక్ట్ చూపుతుందట.
నల్ల మిరియాలు, పసుపు..
నల్ల మిరియాలు, పసుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. ఎందుకంటే.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడం జరుగుతుంది.
ఓట్స్, బెర్రీస్..
బెర్రీస్, ఓట్స్ కలిపి తీసుకోవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ శరీరానికి ఐరన్, బి విటమిన్లను అందిస్తుంది. బెర్రీస్ తినడం వలన శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇవన్నీ మన ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఊబకాయం రాకుండా ఇవి కాపాడుతాయి.
ఆలీవ్ ఆయిల్, టొమాటో..
టొమాటోను సాధారణ కూరగాయలలో వినియోగిస్తుంటారు. కూరల రుచిని పెంచడంలో ఇది దోహదపడుతుంది. అదే సమయంలో ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. ఈ సూపర్ ఫుడ్‌లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి మనలను రక్షిస్తుంది. టోమాటోలలో పోషక విలువలను పెంచాలనుకుంటే ఆలీవ్ ఆయిల్‌లో ఉడికించి తినాలి. అప్పుడు ప్రయోజనాలు డబుల్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..