Bay of Bengal: ఉన్నట్లుండి నీలిరంగులోకి మారిపోయిన బంగాళాఖాతం.. ఇంట్రస్టింగ్ రీజన్స్ చెబుతున్న సైంటిస్టులు..!

Bay of Bengal: మాములుగా సముద్రాలు నీలి రంగులోనే ఉంటాయి. కానీ ఒక్క బంగాళా ఖాతం తప్ప. అవును, బంగాళాఖాతం.. మన బావులు, చెరువులు

Bay of Bengal: ఉన్నట్లుండి నీలిరంగులోకి మారిపోయిన బంగాళాఖాతం.. ఇంట్రస్టింగ్ రీజన్స్ చెబుతున్న సైంటిస్టులు..!
Bay Of Bengal
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 03, 2022 | 10:20 PM

Bay of Bengal: మాములుగా సముద్రాలు నీలి రంగులోనే ఉంటాయి. కానీ ఒక్క బంగాళా ఖాతం తప్ప. అవును, బంగాళాఖాతం.. మన బావులు, చెరువులు, నదుల రంగులో ఉంటుంది. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా నీలిరంగులోకి ఛేంజ్ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి అది అలా ఎలా మారింది? ఈ నీలం రుంగు మార్పు వెనక కారణాలేమై ఉంటాయి? ఇప్పుడిదే విశాఖ తీరంలో జోరుగా వినిపిస్తోన్న ప్రశ్న. దీనిపై శాస్త్రజ్ఞులు ఏమంటున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మహా సముద్రాలు నీలిరంగులో ఉండటానికి ప్రధాన కారణం.. ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి అన్న సిద్ధాంతం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆకాశపు రంగు నీటిపై ప్రతిబింబించడం వల్లే ఇలా జరుగుతుందన్న మాట వింటూనే ఉంటాం. కానీ ఇదొక్కటే కారణం కాదంటారు శాస్త్రజ్జులు. నీటి అణువులు కాంతి కిరణాలను గ్రహించి వెదజల్లడం వల్లే సముద్రం నీలి రంగులో కనిపిస్తుందన్న విశ్లేషణలున్నాయి. సూర్యుడి కాంతి భిన్న తరంగ దైర్ఘ్యాలు కలిగిన తరంగాలతో నిర్మితమై ఉంటుంది. ఈ తరంగాలు ఒక్కో తరంగ దైర్ఘ్యం దగ్గర ఒక్కో రంగును సూచిస్తుందని, నీలం రంగు తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని, ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయనీ అంటారు సైంటిస్టులు. ఈ ఎక్కువ తక్కువల్లో చాలానే దాగి ఉందంటారు నిపుణులు.

ఇంతకీ మనకు ఆకాశం నీలం రంగులో ఎందుకుంటుంది?

వాతావరణంలో వాయు, ద్రవ, ఘన స్థితులతో ఉండే వివిధ పదార్ధాలు భూమిని చేరే సూర్య కాంతిని సంగ్రహిస్తాయి. ఈ పదార్ధాలన్నిటినీ చాలా చాలా చిన్న పరిమాణంలో రేణువులుగా ఉండటం వల్ల.. అవి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని అంటే నీలంరంగు కాంతిని గ్రహించి వెదజల్లుతుంటాయి. కాబట్టి ఆకాశం మనకు నీలంగా కనిపిస్తుందంటారు సైంటిస్టులు.

అదే విధంగా సూర్యుడి కాంతి.. సముద్రాన్ని తాకగానే చిన్నగా ఉన్న సముద్ర జల రేణువులు కూడా అతి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలం రంగునే గ్రహించి వెదజల్లుతుంటాయి. కాబట్టి.. మనకు సముద్రం ఎప్పుడు చూసినా నీలంగానే కనిపిస్తుంది. అంతే కానీ ఆకాశం రంగు నీటిపై ప్రతిఫలించి మాత్రం కాదన్నది ఒక విశ్లేషణ. సముద్రంలో ఎక్కువ భాగం నీలం రంగులో ఉంటుంది. కానీ కొన్ని ప్రదేశాలలో నీలం – ఆకుపచ్చ, ఆకుపచ్చ లేదా పసుపు నుంచి గోధుమ రంగులోనూ ఉంటుంది. సముద్రం రంగు నీలంలో ఉండటానికి కారణాలు అనేకం. నీరు ఎరుపు కాంతిని తక్కువగా గ్రహిస్తుంది. ఎరుపు రంగు 164 అడుగుల లోతుకు మాత్రమే చేరుకుంటుంది. అదే నీలం 655 అడుగుల వరకూ చొచ్చుకుపోతుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు సైంటిస్టులు.

రెండో విషయం ఏంటంటే.. సముద్రపు నీటి అణువులు ఇతర రంగుల కన్నా కూడా నీలి కాంతిని ఎక్కువగా వెదజల్లుతాయి. ఇది ఆకాశంలో నీలి కాంతి పరిక్షేపణంలా ఉంటుందని అంటారు శాస్త్రజ్ఞులు. సాధారణంగా వాతావరణంలో చిన్న చిన్న ధూళి కణాలు, మట్టి కణాలు ఉంటాయి. సూర్య కణాలు వీటిపై పడ్డప్పుడు అవి ఏడు రంగులుగా విడిపోతాయి. ఏడు రంగుల్లో వైలెట్ ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉంటాయి. నీలి రంగు అతి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. అదే సమయంలో ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. దీంతో నీలిరంగు ఆకాశంలో ఎక్కువగా విస్తరించి ఉంటుంది. అందుకే పగటి పూట ఆకాశం నీలంగా కనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఆకాశం రంగు నారింజ లేదా ఎరుపు రంగులో దర్శనమిస్తుంది. దీనికి కారణం కూడా కాంతి కిరణాలే. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు భూమికి దగ్గరగా ఉండటమే ఇందుకు కారణంగా చెబుతారు సైంటిస్టులు.

ఇక సముద్రం రంగు విషయానికి వస్తే.. ఇది చూడ్డానికి నీలి రంగులో ఉంటుంది. కానీ అది దగ్గరగా వెళ్లి చూస్తే ఆ రంగులో ఉండదు. దీనికి కారణం కూడా సూర్య కిరణాలే అంటున్నారు శాస్త్రజ్ఞులు. పగటి పూట సూర్యకిరణాలు నీటిపై పడ్డప్పుడు.. నీరు కాంతి నుంచి వెలువడే ఇతర రంగుల కిరణాలను గ్రహిస్తుంది. అవి నీలి కిరణాలుగా ప్రతిఫలిస్తాయి. ఈ కారణంగా సముద్రం నీలం రంగులో కనిపిస్తుంది అంతేనంటున్నారు నిపుణులు. ఇలా పగటిపూట సూర్యకిరణాలు నీటిపై పడినప్పుడు నీరు కాంతి నుంచి వెలువడే ఇతర రంగుల కిరణాలను గ్రహిస్తుంది. అవి నీలి కిరణాలుగా ప్రతిబింబిస్తాయి. ఈ కారణంగా సముద్రం నీలం రంగులో కనిపిస్తుంది. ఒక్క సముద్ర రంగు మార్పు వెనక ఇంత కథ ఉందన్నమాట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే