AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Wine: వైన్ తాగడం ఆరోగ్యానికి లాభమా.. నష్టమా.. అసలు మ్యాటర్ ఏంటంటే..

వీకెండ్ వస్తే కొంతమంది యువతకు ఒకరకంగా వారంతపు పండుగే.. అందరూ కాకపోయినా చాలామంది వీకెండ్ వస్తే.. వారానికి వచ్చిన ఓ సెలవురోజును ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోతారు. కొంతమంది సినిమాలకు, షికార్లకు వెళ్తే, మరికొంతమంది షాపింగ్ కి వెళ్లి.. అటునుంచి అటు

Red Wine: వైన్ తాగడం ఆరోగ్యానికి లాభమా.. నష్టమా.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Wine
Amarnadh Daneti
|

Updated on: Sep 04, 2022 | 7:16 PM

Share

Red Wine: వీకెండ్ వస్తే కొంతమంది యువతకు ఒకరకంగా వారంతపు పండుగే.. అందరూ కాకపోయినా చాలామంది వీకెండ్ వస్తే.. వారానికి వచ్చిన ఓ సెలవురోజును ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిపోతారు. కొంతమంది సినిమాలకు, షికార్లకు వెళ్తే, మరికొంతమంది షాపింగ్ కి వెళ్లి.. అటునుంచి అటు మంచి రెస్టారెంట్ కి వెళ్లి ఇష్టమైన ఫుడ్ ను లాగించేస్తారు. కాని మరికొంతమంది మాత్రం వీకెండ్ వచ్చిందంటే చాలు మందుతో మంచి విందు చేసుకుంటారు. అదే అల్కహల్ తీసుకునే అలవాటు ఉన్నవారు ఎవరికి నచ్చిన అల్కహల్ తీసుకుంటారు. అల్కాహల్ తాగే అలవాటులేని వారు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యానికి పెద్ద ముప్పు ఉండదనే ఉద్దేశంతో వైన్ తీసుకుంటారు. వైన్ పులియబెట్టిన ద్రాక్ష రసంతో తయారు చేయబడే ఆల్కహాలిక్ పానీయం. వైన్ తాగడం ద్వారా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ 2018 అధ్యయనంలో వెల్లడయ్యాయి. వైన్ తాగడం వల్ల లైఫ్ ఎక్స్టెన్షన్, గుండె ఆరోగ్యానికి మంచిదని ఈఅధ్యయనం వెల్లడించింది. జీర్ణక్రియ సజువుగా జరగడానికి, వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఔషధంగానూ ఇది ఉపయోగపడుతుందని తెలిసింది. అయితే పరిమితంగా మాత్రమే వైన్ ను తీసుకుంటే ఈప్రయోజనాలు.. పరిమితి దాటి తాగితే మాత్రం ఆరోగ్య ప్రయోజనాలు కాదు కదా.. ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: రెడ్ వైన్ మితంగా వినియోగించినప్పుడు హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఎక్కువుగా తీసుకుంటే ప్రయోజనం కంటే హని ఎక్కువుగా ఉంటుంది.

గుండె సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం: వైన్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతో పాటు మొత్తం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రెడ్ వైన్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలో పాలీఫెనాల్స్ ఒకటి. ఇవి రక్తనాళాల వశ్యతను, ఆరోగ్యాన్ని కాపాడుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బ్లడ్ షుగర్ నియంత్రణ: ద్రాక్ష తొక్కలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్, రెస్వెరాట్రాల్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అధ్యయనం ప్రకారం రెడ్ వైన్ ను దాదాపు మూడు నెలల పాటు ప్రతిరోజూ దాదాపు 250 ML తీసుకున్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లుగా వెల్లడైంది.

డిప్రెషన్ తగ్గిస్తుంది: మితమైన ఆల్కహాల్ వాడకం డిప్రెషన్ ను తగ్గిస్తుంది. రెడ్ వైన్ తాగే వారిలో డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుంది. రెడ్ వైన్ వల్ల ఈ ప్రయోజనం ఉన్నప్పటికీ, వైన్ తాగడం డిప్రెషన్ తగ్గించుకోవడానికి సరైన ఆప్షన్ మాత్రం కాదు.

లైఫ్ టైం పెరిగే అవకాశం: రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే, తీసుకోని వారి కంటే ఎక్కువ కాలం జీవించవచ్చని పలు అధ్యయానాలలో తేలింది. వైన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పించే రోగనిరోధక శక్తిని పెంచే శక్తి రెడ్ వైన్ కు ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..