AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Symptoms: ఈలక్షణాలు మీలో కనిపిస్తే.. ఆవ్యాధికి దగ్గరవుతున్నట్లే.. వెంటనే టెస్ట్ చేయించుకోండి..

ఏదైనా ఒక రోగం వచ్చే ముందు శరీరంలో ముందుగా కొన్ని సంకేతాలు కన్పిస్తాయి. వాటిపై జాగ్రత్త తీసుకోకుండా లైట్ తీసుకుంటే.. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది మధుమేహం రోగులు ముందుగా మేల్కొని, ముందు జాగ్రత్తచర్యలు తీసుకోకపోవడంతో..

Diabetes Symptoms: ఈలక్షణాలు మీలో కనిపిస్తే.. ఆవ్యాధికి దగ్గరవుతున్నట్లే.. వెంటనే టెస్ట్ చేయించుకోండి..
Diabetes Patients
Amarnadh Daneti
|

Updated on: Sep 04, 2022 | 6:18 PM

Share

Diabetes Symptoms: ఏదైనా ఒక రోగం వచ్చే ముందు శరీరంలో ముందుగా కొన్ని సంకేతాలు కన్పిస్తాయి. వాటిపై జాగ్రత్త తీసుకోకుండా లైట్ తీసుకుంటే.. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది మధుమేహం రోగులు ముందుగా మేల్కొని, ముందు జాగ్రత్తచర్యలు తీసుకోకపోవడంతో ఆదీర్ఘకాలిక వ్యాధి బారినపడుతున్నారు. కొంతమంది మనకు షుగర్ ఏంటి.. ఏమి ఉండదులే అని లైట్ తీసుకుంటారు. దీంతో ఆలస్యం చేసే కొద్ది షుగర్ వ్యాధి ప్రమాదస్థాయికి చేరుకుంటుంది. అదే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే అది షుగర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రింద తెలిపిన ఏవైనా లక్షణాలు ఉంటే తక్షణమే షుగర్ టెస్ట్ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ వ్యాధి ప్రారంభ లక్షణాలు త్వరగా గుర్తించలేమని.. మనకు తెలియకుండానే ఆవ్యాధి బారిన పడే అవకాశం ఉంది. క్రింద తెలిపిన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి షుగర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

కీళ్లలో నొప్పి: స్పష్టమైన కారణం లేకుండా కండరాలు లేదా కీళ్లలో నొప్పి రావడం మధుమేహ వ్యాధి లక్షణం కావచ్చు. మీకు కండరాలు, కీళ్ల నొప్పులు రావడానికి కారణాలు తెలియకపోతే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

ఏదైనా గాయం వెంటనే తగ్గకపోతే: మీశరీరంలో ఏదైనా భాగంలో గాయమైతే.. తగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటే అది కూడా షుగర్ వ్యాధి లక్షణమే కావచ్చు. మధుమేహం ఉన్నవారికి గాయాలు త్వరగా తగ్గవు. ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొంటే వైద్యుడిని సంప్రదించి.. వారి సలహా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

నిర్ణీత సమయం పడుకున్నా అలసటగా ఉంటే: రాత్రి సమయంలో నిర్ణీత గంటలు పడుకున్నప్పటికి.. ఉదయం లేచిన తర్వాత అలసటగా అనిపిస్తే.. అది కూడా మధుమేహం వ్యాధి లక్షణం అయ్యే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అలసటగా ఉంటుంది. అందుకే అలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలి.

బరువు తగ్గడం: చాలామంది బరువు తగ్గడం మంచిదే అనుకుంటారు. కాని ఒక్కోసారి బరువు తగ్గడం కూడా మధుమేహం వ్యాధి లక్షణం కావచ్చు. అందరిలో ఈలక్షణం కనిపించనప్పటికి.. చాలా ఎక్కువ మందిలో ఈలక్షణం కన్పించే అవకాశం ఉంటుంది. మీరు బరువు తగ్గడం కోసం ప్రత్యేకంగా ఎటువంటి డైట్ తీసుకోకపోయినప్పటికి, బరువు తగ్గితే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..