Skin Care Tips: రోజూ గుప్పెడు దానిమ్మ విత్తనాలు తిన్నారంటే.. మీ చర్మం సహజకాంతితో..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా అందాలి. లేదంటే రోగనిరోధకత తగ్గి వ్యాధులు దాడి చేస్తాయి. ముఖ్యంగా ఆహారంలో భాగంగా ప్రతి రోజూ ఒక దానిమ్మ పండును తీసుకోవడం వల్ల..

Skin Care Tips: రోజూ గుప్పెడు దానిమ్మ విత్తనాలు తిన్నారంటే.. మీ చర్మం సహజకాంతితో..
Pomegranate
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 04, 2022 | 5:38 PM

Pomegranate Benefits for Skin: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా అందాలి. లేదంటే రోగనిరోధకత తగ్గి వ్యాధులు దాడి చేస్తాయి. ముఖ్యంగా ఆహారంలో భాగంగా ప్రతి రోజూ ఒక దానిమ్మ పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండులోని పోషక విలువలు ఆరోగ్యానికేకాకుండా చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మేని మెరుపును రెట్టింపు చేస్తుంది. దానిమ్మ నూనె, సప్లిమెంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దానిమ్మ విత్తనాలతో ఫేస్ మాస్క్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి పని చేస్తుంది.

దానిమ్మ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మొటిమలు రాకుండా నివారిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో పోరాడటానికి యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలు ఈ పండులో ఉంటాయి. అంతేకాకుండా ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు కణాల పునరుత్పత్తిని పెంచి తద్వారా ముడతలు, ఇతర వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడతాయి. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు పనిచేస్తాయి. రోజూ దానిమ్మ విత్తనాలు తినడం వల్ల చర్మం లోపలి నుంచి శుభ్రం అవుతుంది.