AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fitness Secrets: 75 ఏళ్ల నానా పటేకర్ ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసా?

Fitness Secrets: నానా పటేకర్‌ తన ఫిట్‌నెస్‌ మంత్ర గురించి చెబుతూ..తాను రోజూ గంటన్నర లేదా రెండు గంటల పాటు వ్యాయామాలు చేస్తానని అ‍న్నారు. తన శరీరాన్ని ఆయుధంగా భావిస్తానని చెప్పారు. అందువల్లే ఈ వయసులో కూడా తానెంతో స్ట్రాంగ్‌గా ఉంటానని, కనీసం ఇద్దరి నుంచి..

Fitness Secrets: 75 ఏళ్ల నానా పటేకర్ ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసా?
Subhash Goud
|

Updated on: Dec 20, 2024 | 9:02 PM

Share

పద్మశ్రీ అవార్డు గ్రహీత బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తన సాధారణ, ఆరోగ్యకరమైన జీవనశైలికి తరచుగా వార్తల్లో ఉంటాడు. పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ చాలా సాదాసీదాగా జీవించే ఈ నటుడు 75 ఏళ్ల వయసులో కూడా పర్ఫెక్ట్ ఫిట్‌గా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నారు. తాను ప్రతిరోజూ ఒకటిన్నర నుండి రెండు గంటలు వ్యాయామం చేస్తానని, నా శరీరమే నా ఆయుధం, నేను 75 సంవత్సరాల వయస్సులో కూడా ఫిట్‌గా ఉన్నాను. అద్దం ముందు నిలబడడం నాకు ఇప్పటికీ ఇష్టం. ఈ వయస్సులో ఫిట్‌నెస్ కోసం వారు అనుసరించేవి చాలా ఉన్నాయన్నారు.

నానా పటేకర్ ఫిట్‌నెస్ సీక్రెట్:

నానా పటేకర్ ప్రతిరోజూ జిమ్‌లో బెంచ్ ప్రెస్, బైసెప్ కర్ల్స్ లేదా స్క్వాట్స్ చేస్తుంటారు. కానీ మీరు జిమ్‌కు వెళ్లలేకపోతే ఇంట్లో సిట్-అప్‌లు, సూర్య నమస్కారాలు చేయమని సూచించారు. ఇది కాకుండా, అతను ధూమపానానికి దూరంగా ఉంటాడు. అలాగే తన ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

75 ఏళ్ల వయసులో ఫిట్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నానా పటేకర్ లాగా మీరు కూడా 75 ఏళ్ల వయస్సులో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు క్రమం తప్పకుండా ఏరోబిక్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్ట్రెచింగ్ చేయవచ్చు. ఇది శరీరాన్ని చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి వారం 150 నిమిషాల మితమైన, 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలి.

View this post on Instagram

A post shared by Obliques24 (@obliques24_)

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూ 30 నిమిషాలు నడవండి. మరో మంచి ఏరోబిక్ వ్యాయామం సైక్లింగ్. మీకు స్విమ్మింగ్ అంటే ఇష్టమైతే దాన్ని మీ వ్యాయామ దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు. అయితే, ఓవర్ రన్నింగ్ నివారించాలి. ఇది కాకుండా మీరు పుష్-అప్స్ లేదా స్క్వాట్‌లు చేయవచ్చు. అలాగే డంబెల్స్ వంటి బరువులను ఎత్తవచ్చు. ఇది శరీర ఫిట్‌నెస్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి