AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic in Winter: చలికాలంలో పరగడుపున 2 వెల్లుల్లి రెబ్బలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

వెల్లుల్లి ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే దీనిని సరైన క్రమంలో తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో రోజూ ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అలాగే..

Srilakshmi C
|

Updated on: Dec 20, 2024 | 8:56 PM

Share
వెల్లుల్లిలోని శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి తినాలనుకునే వారు ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను బాగా నమిలి, తర్వాత ఒక గ్లాసు వేడినీళ్లు తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని, నీళ్లు తాగితే హైపర్‌టెన్షన్‌ లక్షణాలు తగ్గుతాయి.

1 / 5
US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఓ నివేదిక ప్రకారం.. చలికాలంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జలుబు, ఫ్లూ 63 శాతం తగ్గుతాయని వెల్లడించింది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిలో మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

2 / 5
అయితే వెల్లుల్లిని అందరూ తినడం మంచిదికాదు. ఆయుర్వేదం ప్రకారం, యూరిక్ యాసిడ్, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తిన్నా మంచిదే. అయితే ఏదైనా అలెర్జీ సమస్య ఉంటే మాత్రం వెల్లుల్లి తినే ముందు  వైద్యుడిని సంప్రదించాలి.

3 / 5
అంతేకాకుండా వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసకోశ, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో వచ్చే జ్వరం, గొంతు నొప్పిని నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అలాగే, బరువు తగ్గడానికి వెల్లుల్లిని మీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

4 / 5
రోజూ వెల్లుల్లి రెబ్బను తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గొప్పగా సహాయపడుతుంది.

5 / 5