AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Milk vs Boiled Milk: పచ్చిపాలు, వేడిపాలు.. రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివంటే?

సంపూర్ణ ఆహారమని చెప్పుకునే పాలల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. దాదాపు అన్ని రకాల న్యూట్రియంట్లు లభిస్తాయి. అందుకే మెరుగైన ఆరోగ్యం కోసం పాలు బాగా తాగమని సూచిస్తుంటారు.

Raw Milk vs Boiled Milk: పచ్చిపాలు, వేడిపాలు.. రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివంటే?
Milk
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 27, 2022 | 8:05 AM

Share

సంపూర్ణ ఆహారమని చెప్పుకునే పాలల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. దాదాపు అన్ని రకాల న్యూట్రియంట్లు లభిస్తాయి. అందుకే మెరుగైన ఆరోగ్యం కోసం పాలు బాగా తాగమని సూచిస్తుంటారు. అయితే కొంతమంది పచ్చిపాలు తాగుతుంటారు. ఇంకొంతమంది మరిగించిన పాలు తాగుతుంటారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివనే ప్రశ్నలు చాలా మందికి తలెత్తుతుంటాయి. మరి ఈ విషయంపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే.. పచ్చి పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదట. అమెరికా ఆరోగ్య శాఖకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అందించిన వివరాల ప్రకారం పచ్చిపాలలో హాని కల్గించే బ్యాక్టీరియా ఉంటుంది. ఈకోలి, లిస్టేరియా, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా పచ్చిపాలలో ఉండే అవకాశాలున్నాయి. అందుకే పచ్చి పాలు తాగడం వల్ల ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట.

తేలికగా జీర్ణమయ్యేందుకు..

పచ్చి పాలు తాగడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి కీడు కల్గిస్తుంది. ఫలితంగా డయేరియా, డీ హైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో యాసిడ్ల స్థాయులు కూడా పెరుగుతాయి. పాలు తీసేటప్పుడు ఆ జంతువుల పొదుగు కలుషితమై ఉంటుంది. అంతేకాకుండా..పాలు తీసే వ్యక్తుల చేతులు లేదా పరిసరాలు లేదా గిన్నె కూడా కలుషితమై ఉండవచ్చు. ఆ పాలు నేరుగా పచ్చిగా తాగితే ఆ కలుషితమంతా మీ శరీరంలో చేరుతుంది. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే పాలను బాగా ఉడికించి చల్లారిన తరువాత తాగడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది. ఇక వర్షాకాలంలో , శీతాకాలంలో రాత్రిపూట వేడి వేడి పాలు తాగితే.. చర్మం వేడిగా ఉంటుంది. అంతేకాదు నిద్ర కూడా ఈజీగా పడుతుంది. వేడి పాలల్లో కూడా కాల్షియం, విటమిన్-డి, పొటాషియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వేడి పాలు ఏ సమయంలో తాగినా ఈజీగా జీర్ణమవుతాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..