Health Tips: మోకాళ్లు, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. బెస్ట్ మెడిసిన్ ఈ ఆకుల రసం
Health Tips-Knee Pains: ఒకప్పుడు వయసు రీత్యా వచ్చే వ్యాధులు ఇప్పుడు వయసుతో పనిలేకుండా వచ్చేస్తున్నాయి. దీనికి కారణం.. ప్రస్తుత కాలంలో తినే ఆహారం, వాతావరణలో మార్పులు వంటివి చెప్పవచ్చు. చిన్న చిన్న..
Health Tips-Knee Pains: ఒకప్పుడు వయసు రీత్యా వచ్చే వ్యాధులు ఇప్పుడు వయసుతో పనిలేకుండా వచ్చేస్తున్నాయి. దీనికి కారణం.. ప్రస్తుత కాలంలో తినే ఆహారం, వాతావరణలో మార్పులు వంటివి చెప్పవచ్చు. చిన్న చిన్న పనులకే అలసట, షుగర్ (Diabetic), బీపీ(BP) కీళ్ళనొప్పులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు వయసు పెరిగే కొలదీ ఏర్పడే సమస్య మోకాళ్ల నొప్పులు.. అయితే నేటి కాలంలో మోకాళ్ల నొప్పుల సమస్య యువతలో కూడా కనిపిస్తోంది. కీళ్ళ నొప్పుల బారిన పడిన వారు నొప్పి నుంచి ఉపశమనం కోసం వైద్యుల సూచనలనే కాదు.. ఇంట్లోనే సింపుల్ చిట్కాలను కూడా అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఆలివ్ చెట్టు ఆకుల రసం మోకాళ్ల నొప్పులకు మంచి ఔషధంగా పని చేస్తుందని తేలింది. వివరాల్లోకి వెళ్తే..
*స్విస్ శాస్త్రవేత్తలు కీళ్ళ నొప్పుల నివారణకు చేసిన పరిశోధనల్లో ఆలివ్ లేదా ఆలివ్ చెట్ల ఆకుల సారం పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుందని తేలింది. అంతేకాదు ఆలివ్ చెట్టు ఆకుల్లో ఉన్న ఔషధ సమ్మేళనాలు దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులను కూడా అత్యంత ప్రభావంటంగా నివారిస్తాయని తెలిసింది. ఆలివ్ ఆకుల్లోని ఔషధాలను పాలీఫెనాల్స్ అని పిలుస్తారు. ఇవి దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. కీళ్ళ నొప్పిని, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. *ఆలివ్ ఆయిల్ హృదయ ధమనుల లోపల చేరుకున్న కొవ్వు నిల్వలను కరిగించి.. తద్వారా గుండెకు కూడా రక్షణ అందిస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. *ఆలివ్ ఆకులు రొమ్ము క్యాన్సర్, అల్సరేటివ్, డిప్రెషన్ తగ్గించడంలోనూ సహాయపడతాయి. * ఆలివ్ ఆకుల రసం కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్నీ మస్క్యులోస్కెలెటల్ డిసీజ్ జర్నల్ థెరప్యూటిక్ అడ్వాన్సెస్‌లో ఓ కథనం ప్రచురింపబడింది. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో 55 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 124 మంది పాల్గొన్నారు. ఈ పరిశోధనకు స్విస్ శాస్త్రవేత్త మేరీ-నోయెల్ హోర్కాజాడా నాయకత్వం వహించారు. అధిక బరువు ఉన్న పురుషులు, మహిళలు ఇద్దరిపై వీరి పరిశోధన నిర్వహించారు. వీరిపై సగంమందికి పైగా అధిక బరువు కలిగి ఉన్నారు.. కీళ్ళ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక బరువున్న 62 మందికి కీళ్ళ నిప్పుల నివారణ కోసం 125 mg ఆలివ్ ఆకుల సారాన్ని రోజుకు రెండుసార్లు ఒక మాత్ర రూపంలో ఇచ్చారు. ఇలా రోజూ 6 నెలల పాటు ఇచ్చారు. అనంతరం వీరు మోకాలి నొప్పి నుంచి ఉపశమనం పొందినట్లు గుర్తించారు.
Note: ( ఇందులోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల లేదా వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి పాటించాల్సి ఉంటుంది.)
Also Read: Viral Photo: పొలం బాట పట్టిన సింగిల్ పీస్.. పసుపు కార్మికుల మధ్య ఉన్న నేచరల్ నటిని గుర్తు పట్టగలరా..
Summer Health Care: వామ్మో.. కాకరేపుతున్న ఎండలు.. కూల్‌గా ఉండాలంటే వీటిని తీసుకోండి..