AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulses in Summer: వేసవిలో ఈ పప్పు దినుసులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మంట, వేడికి ఇలా చెక్ పెట్టొచ్చు..

Summer Diet Plan: వేసవికాలం వచ్చింది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో శరీరం చల్లగా ఉండే పదార్థాలను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో ముఖ్యంగా కడుపులో మంట,

Pulses in Summer: వేసవిలో ఈ పప్పు దినుసులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మంట, వేడికి ఇలా చెక్ పెట్టొచ్చు..
Pulses
Shaik Madar Saheb
|

Updated on: Apr 03, 2022 | 6:05 AM

Share

Summer Diet Plan: వేసవికాలం వచ్చింది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో శరీరం చల్లగా ఉండే పదార్థాలను తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో ముఖ్యంగా కడుపులో మంట, శరీరం వేడి సమస్య తరచుగా ఇబ్బంది పెడుతూఉంటుంది. ఫ్రైలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపులో అజీర్ణం, గ్యాస్, ఎసిడిడీ సమస్యలు ఏర్పడతాయి. కడుపులో వేడి కారణంగా రోజు అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. కడుపులో మంటను అరికట్టేందుకు చాలామంది పలు ఆహార డైట్లను వినియోగిస్తారు. కడుపులోని వేడిని చల్లబరచడానికి శీతల పానీయాలు, లస్సీ, జ్యూస్‌లు, షర్బత్ వంటి వాటిని తాగుతారు. వేసవిలో కూల్‌గా ఉండేందుకు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిని తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. మీ ఆహారంలో కొన్ని పప్పు (Pulses) దినుసులను చేర్చుకుంటే.. ఉదర సమస్యలు దూరం చేయడంతోపాటు మంట, వేడిని నివారించవచ్చని పేర్కొంటున్నారు. ఆ పప్పు దినుసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెసర పప్పు..

పెసర పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం ద్వారా దానిలోని పోషకాలన్నీ శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తాయి. పెసర పప్పులో ఎ, బి, సి, ఇ వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో పొటాషియం, ఐరన్, కాల్షియం మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, ఫైబర్ వంటి ఇతర పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. పెసర పప్పు రుచితోపాటు చాలా చల్లగా ఉండేలా చేస్తుంది. పప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

మినప పప్పు..

మినుముల్లో ప్రోటీన్లు, మినరల్స్, అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మినప పప్పు శరీరంలో మంటను నివారించడంతోపాటు.. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్ కూడా సరైన మొత్తంలో ఉంటుంది. దీని కారణంగా ఉదరానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఆర్థరైటిస్ లేదా ఆస్తమా రోగులు మినప పప్పు తీసుకోవడం చాలా మంచిది.

సెనగలు..

సెనగల్లో మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శక్తికి మంచి మూలంగా పరిగణిస్తారు. అందుకే వేసవిలో ప్రజలు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటారు. సెనగల కూరను కూడా చేసుకోని తింటారు. విశేషమేమిటంటే వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే సత్తు కూడా ఈ పప్పుతోనే తయారవుతుంది. ఈ పప్పుతో సత్తును సులువుగా తయారు చేసుకోవచ్చు లేదా మార్కెట్‌లో పొందవచ్చు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కడుపు చల్లగా ఉండేందుకు సత్తు నీళ్లను తాగి ఇంటి నుంచి బయటకు వస్తుంటారు.

Also Read:

Health Tips: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా.. ఈ పదార్థాలను తగ్గిస్తే మంచిది..

Summer Health: వేస‌విలో ఈ ఆహారాల‌కు దూరంగా ఉండండి.. అతిగా తింటే తీవ్ర ఇబ్బందులు..

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!