Health Tips: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా.. ఈ పదార్థాలను తగ్గిస్తే మంచిది..
మైగ్రేన్ నొప్పి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రద్దీగా ఉండే ప్రదేశానికి వెళితే, మీ మైగ్రేన్ నొప్పి మరింత పెరుగుతుంది.
మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత సమస్య. మైగ్రేన్ వచ్చిన వ్యక్తికి చాలా సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే మైగ్రేన్ కారణంగా తలలో ఒక వైపున తీవ్రమైన నొప్పి ఉంటుంది. మైగ్రేన్ నొప్పి మందులు తీసుకోకుండా నయం కాదు. దీని నొప్పి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు ఉంటుంది. ఇలాంటి సమయంలో రద్దీగా ఉండే ప్రదేశానికి వెళితే, మీ మైగ్రేన్ నొప్పి మరింత పెరగవచ్చు. అలాగే ఎక్కువ ధ్వని కూడా వీరికి చాలా హానికరంగా ఉంటుంది.
మైగ్రేన్ లక్షణాలు..
కళ్ళ ముందు చీకటి మచ్చలు
చిరాకు
మాట్లాడటానికి ఇబ్బందిపడడం
చేతులు, కాళ్ళలో జలదరింపు
కళ్ల కింద నల్లటి వలయాలు
శరీరంలో బలహీనత
వీటికి దూరంగా ఉండాలి..
చీజ్- చీజ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఇది మైగ్రేన్ సమస్యను మరింత పెంచుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మీకు మైగ్రేన్ సమస్య ఉంటే, బ్లూ చీజ్, బ్రీ, చెడ్డార్, స్విస్, ఫెటా, మోజారెల్లా మొదలైన వాటి వినియోగాన్ని తగ్గించాలి.
తీపి పదార్థాలు- స్వీట్లను ఎక్కువగా ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. డైట్ కోక్, ఇతర క్యాలరీలు లేని పానీయాలలో సాధారణంగా కనిపించే అస్పర్టమే వంటి కృత్రిమ స్వీటెనర్లు మైగ్రేన్ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధనలో తేలింది.
చాక్లెట్- మైగ్రేన్ సమస్యను కూడా పెంచేందుకు చాక్లెట్ పనిచేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో తక్కువ మొత్తంలో చాక్లెట్ తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కాఫీ – కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య పెరుగుతుంది. రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువ కాఫీని తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం.
వీటితో మైగ్రేన్ ఎక్కువయ్యే ఛాన్స్..
చికెన్
పాల ఉత్పత్తులు
డ్రై ఫ్రూట్స్
వెల్లుల్లి
ఉల్లిపాయ
బంగాళదుంప చిప్స్
Also Read: Summer Health: వేసవిలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. అతిగా తింటే తీవ్ర ఇబ్బందులు..