Summer Health: వేస‌విలో ఈ ఆహారాల‌కు దూరంగా ఉండండి.. అతిగా తింటే తీవ్ర ఇబ్బందులు..

కొన్ని పదార్థాలను అతిగా తీసుకుకోవడం వల్ల ఎన్నో చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. వేసవిలో మనం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Summer Health: వేస‌విలో ఈ ఆహారాల‌కు దూరంగా ఉండండి.. అతిగా తింటే తీవ్ర ఇబ్బందులు..
Oily Food
Follow us

|

Updated on: Apr 02, 2022 | 8:46 PM

Health Tips: ఎండలు ముదిరిపోతున్నాయి. ఈ కాలంలో చాలా జగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ సీజ‌న్‌లో ద‌గ్గు, జ‌లుబులు కొందరిని వేధిస్తుంటాయి. ఈ కాలంలో శరీరం వేడిగా ఉంటుంది. ఈ వేడి కార‌ణంగా మరికొందరిని విరేచనాలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, ఈ కాలంలో తీసుకునే పదార్థాలపై ఓ కన్నేసి ఉండడం చాలా మంచింది. లేదంటే కడుపులో మంట‌, ఎసిడిటీ లాంటి సమస్యలు ఎన్నో చుట్టుముట్టే అవకాశం ఉంది. నీళ్లు సరిగ్గా తాగకపోయినా, కొన్ని పదార్థాలను అతిగా తీసుకుకోవడం వల్ల ఎన్నో చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. వేసవిలో మనం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నూనె పదార్థాలు: వేసవిలో నూనె పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. దీని వలల్ల విరేచ‌నాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నూనె పదార్థాలు దప్పికను పెంచుతాయి. అలాగే మనం డీహైడ్రేష‌న్‌కు గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నూనెతో చేసిన పదార్థాలకు ఈ కాలంలో దూరంగా ఉండాలి.

2. మామిడి కాయ‌లు: వేసవిలో ఎక్కువగా లభించే మామిడి పండ్లను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిని పరిమితంగా తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది. అలా కాదని, విపరీతంగా లాగిస్తే మాత్రం, శ‌రీరంలో విపరీతంగా వేడి పెరుగుతుంది. దీని వల్ల విరేచనాలు ఎటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏ పదార్థమైనా పరిమితంగా తీసుకుంటేనే మంచింది.

3. మద్యం: ఈ సీజన్‌లో దాహం ఎక్కువగా అవుతుంటుంది. ఇక మ‌ద్యం అతిగా సేవిస్తే, అధికంగా దప్పిక వేస్తుంది. ఎక్కువగా దాహం వేయడంతో, నాలుక పొడిబారుతుంది. అలాగే శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి లివ‌ర్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వీలైతే సమ్మర్‌లో అతిగా మద్యం సేవించడం తగ్గించాలి.

4. టీ, కాఫీలు: టీ, కాఫీల‌ను ఎక్కువగా తాగడం వల్ల ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుంది. టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్‌, ఎసిడిటీ బారిన పడే అవకాశం ఉంది. అందుకే వీటికి బ‌దులుగా కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీ, వాటర్ మిలాన్ జ్యూస్, కర్బూజా జ్యూస్‌, కీర‌దోస కాయలు లాంటివి తీసుకోవడం మంచింది. వీటిని తీసుకుంటే మన శ‌రీరంలో నీటి శాతాన్ని పుష్కలంగా ఉంచేలా చేస్తాయి.

5. మ‌సాలాలు, కారం, నాన్‌వెజ్: ఎండాకాలంలో నాన్‌వెజ్‌కు దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమ్యలతోపాటు, ఒంట్లో అధిక కొవ్వు కూడా చేరే అవకాశం ఉంది. అలాగే పొట్టలో మంటను కూడా కలిగిస్తాయి. వీటితోపాటు కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోకూడదు.

6. బేక‌రీ, జంక్ ఫుడ్స్‌: జంక్స్ ఫుడ్స్‌తోపాటు, బేకరీ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే దాహం ఎక్కువగా వేస్తుంది. అలాగే ఇవి శ‌రీరంలో నీటి శాతాన్ని విపరీతంగా త‌గ్గిస్తాయి. అందుకే ఈ ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.

Also Read: Banana: అరటిపండుతో పాటు ఈ ఫ్రూట్ కలిపి తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

Foot Pain Relief: పాదాలలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి