AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: పొలం బాట పట్టిన సింగిల్ పీస్.. పసుపు కార్మికుల మధ్య ఉన్న నేచరల్ నటిని గుర్తు పట్టగలరా..

Viral Photo: డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చాలామంది నటీనటులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం డాక్టర్(Doctor) చదివి మరీ యాక్టర్ అయింది. అంతేనా.. తన నటన, డ్యాన్స్ కు అబ్బాయిలే కాదు..

Viral Photo: పొలం బాట పట్టిన సింగిల్ పీస్.. పసుపు కార్మికుల మధ్య ఉన్న నేచరల్ నటిని గుర్తు పట్టగలరా..
Sai Pallavi Photo Goes Vira
Surya Kala
|

Updated on: Apr 03, 2022 | 8:01 AM

Share

Viral Photo: డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చాలామంది నటీనటులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం డాక్టర్(Doctor) చదివి మరీ యాక్టర్ అయింది. అంతేనా.. తన నటన, డ్యాన్స్ కు అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా ఫిదా(Fida)నే.. సహజమైన నటన.. అంతకు మించి.. ఆ అమ్మాయిని చూస్తుంటే.. మన ఇంట్లోనే, పక్కింట్లోనో చూసినట్లు అనిపిస్తుంది. అంత సింపుల్ గా నేచరల్ గా ఉంటుంది. సహజమైన నటనతో ఓ ఐకాన్.. సింగిల్ పీస్ అనిపిస్తుంది ఆ సుందరి.. మలయాళం(Malayalam)లో ప్రేమమ్ మువీ(Premam Movie) తో హీరోయిన్ గా అడుగు పెట్టగా.. టాలీవుడ్ లో ఫీదా సినిమాలో భానుమతి ఇక్కడ సింగిల్ పీస్ అంటూ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ చెన్నై చిన్నది పొలం బాట పట్టింది.ఈ ఫోటోలో ప్రముఖ టాలీవుడ్‌ నటి ఉంది గుర్తించారా అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

అయితే అసలు యాక్టర్స్ పొలంలో అడుగు పెడతారా.. ఏదైనా సినిమా షూటింగ్ సందర్భంలో తప్ప అని అనుకుంటున్నారా.. అయితే ఈ ఫోటోని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే పొలంలో పనిచేసే కార్మికుల మధ్యలో మన ఫిదా బ్యూటీ సాయి పల్లవి కనిపిస్తుంది. పసుపు తోటలో కార్మికుల మధ్య సాయి పల్లవి.. చిరు నవ్వులు చిందిస్తూ.. సంతోషంగా కుర్చుని ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సాయి పల్లవి కూడా పసుపు తోటలో కార్మికుల తో పాటు.. పనిచేసినట్లు తెలుస్తోంది. కాళ్ళకు చెప్పులు లేకుండా సాధారణ కార్మికురాలిగా తోటపని చేసినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలకు టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందించింది. హార్ట్‌ సింబల్‌ ఇచ్చింది. నీలా ఎవ్వరూ లేరు అంటూ శ్రద్ధా శ్రీనాధ్‌ ప్రశంసల వర్షం కురిపించింది.

Also Read: Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..